వేదాలలోని విజ్ఞానం

వేదమంటే జ్ఞానమని అర్థం. తెలుసు కొందామనుకొనే జిజ్ఞాసువులకు కావలసిన ఏ రకమైన విషయ జ్ఞానమైనా, అంటే పారమార్థికమైనదైనా, లేక లౌకికమైనా ఇక్కడ లభిస్తుందని భావం. భారతీయుల విశ్వాసం ప్రకారం వేదములు శాశ్వతమైనవి, నిత్య సత్యమైనవి. ప్రాచీన కాలంలో మహర్షులు సమాధి స్థితిలో ఉండి తపస్సు చేసుకొంటూ ఉన్నప్పుడు వారు దర్శించినవే వేద మంత్రాలు. వేలాది మంది మహర్షుల ద్వారా లక్షలాది మంత్ర వాక్యాలు.
వీటన్నింటినీ శ్రీ వేదవాస మహర్షి ప్రధానంగా 4 వేదాలుగా విభజించారు. ఈ నాలుగు వేదాలకు మొత్తం మీద 1131 శాఖలు ఉండేవి. కాని ఈ రోజున మొత్తం మీద 13 శాఖలే లభిస్తున్నాయి. అందులో నేడు 7 శాఖలు ఉండేవి. కాని ఈ రోజున మొత్తం మీద 13 శాఖలే లభిస్తున్నాయి. అందులో నేడు 7 శాఖలు మాత్రమే అధ్యయనంలో ఉన్నాయి. అంటే సుమారు 1 శాతం మాత్రమే ఉన్నాయి. 99 శాతం పోగొట్టుకొన్నాము. ఈ ఒక శాతం వేద వాజ్మయం లోను ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికే చాలా శ్రమ పడవలసి వస్తోంది. కారణం అందులో యజ్ఞాలు, మోక్షం మొదలయిన పారలౌకిక విషయాలతో బాటు, గణితము, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, జ్యోతిషం, విమాన శాస్త్రం మొదలయిన అనేక విషయాల ప్రస్తావన అతిగహనంగా ఉంది. ఇవికాక, ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదం, భవన నిర్మా ణాలకు సంబంధించిన స్థాపత్యవేదం మొద లయిన ఉపవేదాలు శాస్త్రీయ విషయాలను చాలా ఎక్కువగా వివరించాయి.
వేదాలలోని విషయాలను అర్థం చేసుకోవ డానికి వేదాంగాల పరిశీలన ఎంతైనా ఆవశ్యకం. అవి చదివితేనే గాని, వేదంలో వాడే పారిభాషిక పదాలు వాటి అర్థాలు అర్థం కావు. కాని ఈ వేదాంగాలు, వేదాలు కూడా గణితానికి చాలా ప్రాధాన్య మిచ్చాయి. వేదాలలో ఉన్న గణితాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ అనేక గ్రంథాలు పూర్వకాలంలోనే వ్రాయబడ్డాయి. ఈ గ్రంథాలను రచించిన వారిలో ముఖ్యులు బోధాయన మహిర్షి, గర్గ మహర్షి, మేధాతిథి, పరాశరుడు, కశ్యపుడు, మయుడు, బృహస్పతి, తరువాత కాలంలోని ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరుడు మొదలయిన వారు ఈ కోవకు చెందిన వారే. పరంపరగా వచ్చిన ఈ వేద గణితము ఈ దేశం నుండి అరేబియా దేశానికి వెళ్ళినట్టుగా అనేకమంది చరిత్రకారులు ఉద్ఘాటించారు. క్రీ.శ. 770 ప్రాంతంలో ఉజ్జయిని నివాసి అయిన కంకుడు అనే హిందూ పండితుడు ఖరీఫ్‍ ఆల్‍ మంసూర్‍ చేత బాగ్దాదు సభకు ఆహ్వానించబడి, అక్కడి అరబ్‍ విద్వాంసులకు మన గణితాన్ని జ్యోతిష్యాన్ని బోధించినట్లు తెలుస్తోంది. ఇతని సహాయంతోనే బ్రహ్మగుప్తుని బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని, అరేబియా భాషలోకి తర్జుమా చేశారు. అసలు సిరియాలో క్రీ.శ. 7వ శతాబ్దినాటికే హిందూ అంకెలు వాడుకలో ఉన్నట్లు ఫ్రెంచి దేశపు శాస్త్రవేత్త వీ.ఖీ.చీవఙ అభిప్రాయ పడినట్టుగా •తీశీ•. జీవఅ• దీవస్త్ర. తన ని•అ అవ• శ్రీఱస్త్రష్ట్ర• శీఅ శీ•తీ అ•ఎవతీ•శ్రీ•• అనే వ్యాసంలో వ్రాశాడు. ఈ విధంగా ప్రపంచం అంతటా ప్రచారం పొందిన భారతీయ వేద గణితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు ఈ క్రింద వివరించబడటం జరిగింది.
1. అంకెలతో ప్రారంభమయిన వేద గణితం
(ఎ) గణితానికి పునాదులు 1, 2, 3, 4 మొదలైన అంకెలు. ఈ అంకెలకు సంబంధించిన మంత్రాలు చాలా చోట్ల కనిపిస్తాయి.
వేదమంటే జ్ఞానమని అర్థం. తెలుసు కొందామనుకొనే జిజ్ఞాసువులకు కావలసిన ఏ రకమైన విషయ జ్ఞానమైనా, అంటే పారమార్థికమైనదైనా, లేక లౌకికమైనా ఇక్కడ లభిస్తుందని భావం. భారతీయుల విశ్వాసం ప్రకారం వేదములు శాశ్వతమైనవి, నిత్య సత్యమైనవి. ప్రాచీన కాలంలో మహర్షులు సమాధి స్థితిలో ఉండి తపస్సు చేసుకొంటూ ఉన్నప్పుడు వారు దర్శించినవే వేద మంత్రాలు. వేలాది మంది మహర్షుల ద్వారా లక్షలాది మంత్ర వాక్యాలు బహిర్గతమయ్యాయి.
ఉదాహరణకు కృష్ణయజుర్వేదంలోని 7వ కాండలోని 2వ పన్నంలో ఉన్న మంత్ర వాక్యం.
ఏకస్మై స్వాహా ద్వాభ్యాగ్‍ స్వాహా త్రిభ్యః స్వాహా చతుర్భ్యః స్వాహా పఞ్చభ్య స్వాహా షడ్‍భ్యః స్వాహా సప్తభ్యఃస్వాహా అష్టాభ్యః స్వాహా నవభ్యః స్వాహా దశభ్యః స్వాః హైకాదశభ్యః స్వాహా …… (కృ. య. సం 7-2-11)
(బి) హోమాలు చేసేటప్పుడు ఎన్నిసార్లు చేశారో తెలియడానికి (ఏకం, ద్వే, త్రీణి, చత్వారి…….) అని లెక్కబెట్టడం ఈ వేళకు కూడా ఉంది.
2. సరిసంఖ్యలు, బేసిసంఖ్యలు
అంకెలను ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. మొదటి వర్గం సరిసంఖ్యలు, రెండవ వర్గం బేసి సంఖ్యలు, దీనికి సంబంధించిన ఒక మంత్రం కూడా పై ప్రకరణంలోనే కన్పిస్తుంది.
ఏకస్మై స్వాహా త్రిభ్యః స్వాహా పఞ్చభ్య సప్తభ్యః స్వాహా నవభ్యః స్వాహా …… (కృ. య. సం 7-2-12)
ద్వాభ్యాగ్‍ం స్వాహా చతుర్భ్యః స్వాహా షడ్‍భ్యః స్వాహా 2ష్టాభ్యః స్వాహా దశభ్యః స్వాహా ద్వాదశభ్యః స్వాహా …… (కృ.య. సం 7-2-13)
3. స్థానం-విలువ- సంఖ్యామానం దశాంశ విధానం
ఈ రోజు కూడా ప్రపంచం అంతటా ప్రచారంలో ఉన్న దశాంశ విధానం వేదాలలో అనేకచోట్ల కన్పిస్తుంది. ఒకట్టు, పదులు, వందలు, వేలు, పదివేలు పద్ధతిలో 1 తర్వాత ఒక్కొక్క సున్న చేరిస్తే విలువ 10 రెట్లు పెరుగుతుంది అన్న విషయంపైన ఆధారపడిందే దశాంశ విధానం. ఈ విధానంలో కొన్ని కొన్ని స్థానాలకు మన తెలుగులోను, ఇంగ్లీషులోను వాడిన పేర్లనే కలుపుకుంటూ స్థానాల విలువను వ్యక్తం చేస్తారు. ఉదాహరణకు పదివేలలో అంతకు ముందు వచ్చిన పది, వేయి అనుపదాలు వాడుకొని క్రొత్త స్థానాన్ని వివరిస్తున్నాము. కాని వేదగణితంలో పది వేలు, పది లక్షలను విడివిడిగా సూచించడానికి ప్రత్యేక పదాలు ఉన్నాయి.
ఋగ్వేదంలో, యజుర్వేదంలో, మరియు అథర్వణ వేదంలో వందలాది మంత్రాలతో సంబంధం ఉన్న మేధాతిధి అనే మహర్షిని ఈ సందర్భంగా చెప్పకుండా ఉండలేము. అతడు దర్శించిన వాటిల్లో దశాంశ విధానాన్ని ప్రాతిపదికగా పెట్టుకొని ఒకటి లగాయతు 1012 వరకు (లక్ష కోట్ల వరకు) చెప్పిన మంత్రం కన్పిస్తుంది.
ఏకాచ దశ శతం చ సహస్రం చాయుతం చ నియుతంచ ప్రయుతం చార్బుదంచ న్యర్బుదంచ సముద్రంచ మధ్యం చాంతశ్చ పరార్థశ్చ……..
అట్లాగే వేరొకచోట ఒకటి లగాయతు 1019 వరకు (లక్ష కోట కోట్ల వరకు) చెప్పింది కూడా ఉన్నది

Review వేదాలలోని విజ్ఞానం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top