షష్ఠిపూర్తిలోని పరమార్థం ఏమిటి?

తిలకాన్ని ఎందుకు ధరించాలి?
మనదేహంలోని ప్రతి అవయవానికి ఒక్కో అధి దేవత ఉన్నారు. అలాగే నుదుటన బ్రహ్మదేవుడు అధి దేవత. నుదురు బ్రహ్మస్థానం. బ్రహ్మరంగు ఎరుపు. కనుక బ్రహ్మస్థానమైన నుదుటున ఎరుపు రంగు తిలకం తప్పనిసరిగా ధరించాలి.
నుదుటున సూర్యకిరణాలు సోకరాదు. మనలోని జీవి, జ్యోతి స్వరూపుడిగా భూమి మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కనుక తిలకాన్ని ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడివేలుతో ధరిస్తే ఆయుష్షు పెరుగుతుంది. బొటనవేలితో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తీ, ముక్తీ కలుగుతుంది.
ప్లాస్టిక్‍ బొట్టు బిళ్ళలకన్నా సాధారణ కుంకుమ ధరిస్తే జ్ఞానచక్రాన్ని పూజించినట్టు అవుతుంది.
కుడి ముక్కురంధ్రం పేరు పింగళ. ఎడమ ముక్కు రంధ్రం పేరు ఇడ. ఈ రెంటినీ పైకి ఏటవాలుగా పంపిస్తే ఆ రెండు కలిసేచోట అంటే భూమధ్యంలో ఉండేది సుషుమ్ననాడీ స్థానం. ఆ సుషుమ్న శిరస్సు మధ్యలో ఉన్న బ్రహ్మ రంధ్రం నుండి వెన్నుముక చివరి వరకు నిటారుగా ఉంటుంది. ఈ మూడు కలిసే చోట బొట్టుపెట్టాలి. శైవులైతే అడ్డంగా గీసే మూడు గీతలలో పైన కింది గీతలని రెండు వేళ్లతో ఎడమ నుండి కుడికి గీసి, మధ్యగీతని కుడి నుండి ఎడమకి గీయాలి. అదే వైష్ణవులైతే అటు ఇటు గీతలని ఇడపింగళ నాడులకి గుర్తుగా నిటారుగా గీసి, మధ్యలో సుషుమ్నం ఉందని మరోగీతని గీయాలి. ఎవరైనా కను బొమ్మల మధ్యనే బొట్టు పెట్టాలి.
అనుష్ఠానం చేసినా, అర్చన చేసినా వైదిక కర్మకాండలు చేసినా, సంస్కార విధులు నిర్వర్తిస్తున్న నుదుటిపై, శరీరంపై తిలకధారణ చేయడం ఆచారం. తిలకం పెట్టుకోకుండా చేసే ఏ కార్యమూ సఫలీకృతం కాదు.
కుంకుమ, సింధూరం, హోమభస్మం, చందనం, రావి, తులసి చెట్ల మొదలులో ఉన్న మట్టి మొదలైన వాటిని తిలకాల తయారీలో ఉపయోగిస్తారు. దేవీదేవతలకు బొట్టు పెట్టేటప్పుడు అనామిక వేలుతో, స్వయంగా బొట్టు పెట్టుకొనేటప్పుడు మధ్యవేలితో, పితృగణాలకి చూపుడు వేలుతో, బ్రాహ్మణులు, శ్రేష్ఠవ్యక్తులకు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో పెట్టాలి.కనుబొమ్మల మధ్య తిలకధారణ చేస్తే అక్కడ ఉండే ఆజ్ఞాచక్రం మేల్కొంటుంది. మానవుని యొక్క శక్తి ఊర్థ్వతామి అవుతుంది. తిలకధారణ వల్ల శరీరంలో చల్లదనం వచ్చినట్లనిపిస్తుంది. ఉదాసీనత పోతుంది. ఓజస్సు, తేజస్సు పెరుగుతుంది. నుదుటిపై తిలకం వశీకరణ మంత్రంలాంటిది. ఇది చూపరులకు ఆకర్షితు లను చేస్తుంది. దుష్టశక్తుల నుంచి రక్షిస్తుంది. మనో వాంఛలు తీరుస్తుంది. ఆబాలగోపాలం తిలకధారణ చేయండి. సంప్రదాయాన్ని పాటించండి.
బిల్వ వృక్షం, ఎక్కడ పుట్టింది?
శ్రీ మహావిష్ణువు తన సతితో కలసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షాన్ని దేవతలు స్వర్గంలోనూ, మందర పర్వతం పైనా, వైకుంఠంలోనూ నాటారు. శివుని కిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండినా, కోసి రెండు మూడు రోజులైనా శివపూజకు వాడ కూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వానికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానము.
షష్టి పూర్తి వేడుకలు ఎందుకు చేసుకోవాలి?
ఇరవై సంవత్సరాల బాల్యమూ, మరో నలభై సంవత్సరాలు యవ్వనమూ, కౌమారాలతో అరవై నిండి పోతాయి. అప్పటికే ఎంతో అలసిపోతారు తప్పులూ, ఒప్పులూ, కష్టాలూ, నష్టాలూ, అయిన వారిని దూరం చేసుకోవటమూ వంటివన్నీ అనుభవించి అరవైకి చేరుకున్నాక వెనుతిరిగి చూసుకోవటమే షష్టిపూర్తి. కోపావేశాలూ, పగలూ, ప్రతీకారాలూ, పట్టుదలలూ వదిలి అందర్నీ ఆహ్వానించి, అన్ని తప్పులనూ క్షమించటమే కాకుండా తనను క్షమించగలిగే వారికి క్షమాపణ చెప్పి అందర్నీ ఆహ్వానించి చేసుకునే పండుగే షష్టిపూర్తి. ఆ వయసు వచ్చేటప్పటికి అలా షష్టిపూర్తి చేసుకోవటం ద్వారా తను వదిలేసిన కర్మలేమున్నాయో తెలుస్తుంది. అందుకే ఆ సమయంలో తులాభారం తూగి ధనాన్ని పేదలకి పంచుతారు. అయిన వారికీ, ఆడపిల్లలకీ కావలిసినవన్నీ ఇస్తారు.

Review షష్ఠిపూర్తిలోని పరమార్థం ఏమిటి?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top