సలాం వెన్నెల వట్టికొట్టి…!

ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్న చిన్న పిల్లలను ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది డల్లాస్‍లోని మన తెలుగమ్మాయి. 14ఏళ్ల వెన్నెల వట్టికుటి ఫ్లోరిడా రాష్ట్రంలో 8వ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై ద•ష్టి సారించిన వట్టికుటి పలు స్వఛ్చంద సంస్థల్లోనూ పని చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లల సంరక్షణకు నడుం బిగించిన వట్టికుటికి తన తండ్రి కూడా తోడయ్యాడు. గత మూడేళ్లుగా స్వఛ్చంద సంస్థలలో పనిచేస్తూ పిల్లల సంరక్షణ, బాధ్యత తదితర అంశాలను అవపోసన చేసుకుంది. సేవ్‍ చైల్డ్ సంస్థలో విద్యార్థిగా ఉంటూ చురుకుగా పాల్గొంది.
అలాగే భారత దేశంలో పేదరికం ఎక్కు వగా ఉండటం వారికి కూడా ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్న తనకు ఇక్కడి మిత్రులు కూడా తోడ య్యారు. దీంతో సేవ్‍ చైల్డ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలను అక్కున చేర్చుకుంటోంది వట్టికుటి. ప్రస్తుతం టెక్సాస్‍ రాష్ట్రంలోని డల్లాస్‍లో ఉంటున్న వట్టికుటి ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించడం, సవాళ్లను ఎదుర్కోవడంపై ద •ష్టి కేంద్రీకరించింది. ఇలాంటి బ •హత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకునే వాళ్లు ఎంతోమంది గొప్పవాళ్లుంటారు. అయితే అనుకున్నది సాధించాలంటే అందుకోసం తమవద్ద నిధులుండాలి. దాంతో సమాజంలో పేదరికంతో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను తుడిచిపెట్టేందుకు గాను తన తండ్రితో కలిసి నిధులు సేకరించేందుకు మౌంట్‍ ఎవరెస్ట్ బేస్‍ శిబిరానికి ట్రెక్కింగ్‍ అవకాశం దక్కించుకుంది వట్టికుటి. ఇదొక చైల్డ్సేవ్‍కి సవాలుగా తీసుకున్న వట్టికుటి.., మౌంట్‍ ఎవరెస్ట్ ఫండ్‍ రైసింగ్‍ ని ఛాలెంజ్‍ గా తీసుకుంది. 13ఏళ్ల వయసున్న వెన్నెల వట్టికుటి ఎవెరస్ట్ పైకి ఎక్కడానికి వెనుకాడలేదు. అంతకుముందు నేపాల్లో ఎవరెస్ట్ బేస్‍ క్యాంప్‍ కు ట్రెక్‍ అయ్యింది. ఇదే వట్టికుటి యొక్క మొదటి ట్రెక్కింగ్‍ అనుభవం అని చెప్పాలి. వట్టికుటి చేసిన సహసానికి సేవ్‍ ది చైల్డ్ ఒక ప్రేరణగా చెప్పాలి. పేదరికంతో మగ్గుతున్న పిల్లలకు సహాయం చేయడమే లక్ష్యంగా తాను ట్రెక్కింగ్‍ చేశానన్న వట్టికుటి.. మౌంట్‍ ఎవరెస్ట్ బేస్‍ క్యాంప్‍కు సేవ్‍ ది చైల్డ్ తో ఎంతో సంబంధముందని తెలి పింది. ఇండియా, ఆఫ్రికా దేశాలలో నివసిస్తున్న పేదరిక పిల్లలను సేవ్‍ చేయడమే తన లక్ష్యమని చెబుతోంది. కేవలం 8 రోజుల్లో మౌంట్‍ ఎవరెస్ట్ బేస్‍ క్యాంప్‍కు ట్రెండ్‍ చేయడం నిజంగా ఒక సవాలనే చెప్పాలి. అయినా ధ •డసంకల్పంతో ట్రెక్కింగ్‍ చేసింది. వెన్నెల వట్టికుటి మౌంట్‍ ఎవెరెస్ట్ బేస్‍ క్యాంప్‍ ఛాలెంజ్‍ 2017ను ఆమె తండ్రి వినయ్‍ వట్టికుటితో కలిసి ప్రారంభించింది. ప్రధానంగా చైల్డ్ రైట్స్ కోసం సవాలుగా తీసుకున్న వట్టికుటి పర్వతాన్ని అధిరోహించింది. ప్రపంచంలోని యువతుల పేదరికాన్ని పాలద్రోలి విద్య, వైద్యం అందుబాటులో ఉంచాలన్నది తన కోరిక. అంతేకాదు వెన్నెల వట్టికుటి పెటల్‍ ఫెటిసైడ్‍, మాలిన్ట్రిషన్‍, చైల్డ్ ట్రాఫికింగ్‍, మెన్స్ట్రుల్‍ హైజీన్‍, చైల్డ్ లేబర్‍ అండ్‍ చైల్డ్ మ్యారేజ్‍ వంటి వాటికి కారణమైన బాలిక శిశు హక్కుల కోసం సైతం క •షిచేస్తోంది. వెన్నెల మొత్తానికి విజయవంతంగా 23,500 డాలర్లు సమకూర్చింది. అలాగే ఉగాండాలో 200మంది చిన్నారులు, భారతదేశంలోని మురికివాడల్లో నివసిస్తున్న 1500 మంది చిన్నారులతో పాటు యూఎస్‍లో ఉన్నటువంటి పేదరిక బాలికలకు వైద్య, విద్యను అందించడంతో పాటు వారి పేదరికాన్ని పోగొట్టేందుకు క•షిచేస్తోంది. మరోవైపు 2016 వార్షిక సంవత్సరానికి గాను ప్రెసిడెన్షియల్‍ వాలంటీర్‍ సర్వీస్‍ అవార్డును స్వీకరించేందుకు వెన్నెల వట్టికుటి పేరు నామినేట్‍ అయింది.

Review సలాం వెన్నెల వట్టికొట్టి…!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top