కావాల్సినవి: తాజా స్ట్రాబెర్రీలు – 2 కప్పులు, నిమ్మరసం – టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు, పంచదార – ముప్పావు కప్పు, మొక్కజొన్న గంజి (కార్న్ ప్టార్చ్) – 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ – అర టేబుల్ స్పూన్, వెనిల్లా ఐస్‍క్రీమ్ – 2 స్కూప్‍లు, గవ్వలు – 15 (మైదాపిండిలో వెన్న, పాలుపోసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పలచగా ఒత్తాలి. గుండ్రంగా చేసి ఉంచిన ఒక్కో పొరను చేత్తో మధ్యకు ఒత్తి చిన్న గిన్నెలా తయారు చేసి కాగుతున్న నూనెలో వేసి వేయించి తీయాలి.
త•యారు చేసే విధానం: స్ట్రాబెర్రీలను ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి అవి మగ్గుతుండగా వెడల్పాటి గరిటె లేదా పప్పు గుత్తితో అదుముతూ ఈ ముక్కలను గుజ్జుగా చేయాలి. దీంట్లో నిమ్మరసం నీళ్లు, పంచదార కార్న్స్టార్స్, ఉప్పు వేసి కలపాలి. ఎంతగా అంటే కార్న్స్టార్స్ మొత్తం స్ట్రాబెర్రీ గుజ్జుతో కలిసిపోవాలి. అప్పుడు మంట తీసేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి ఫ్రిజ్‍లో పెట్టి చల్లబడనివ్వాలి. మిగతా కప్పు స్ట్రాబెర్రీలను సగం ముక్కలుగా కట్ చేయాలి. తయారు చేసి పెట్టుకున్న షెల్ (గవ్వ)తోస్ట్రాబెర్రీ మిశ్రమం, ఆ పైన ఐస్‍క్రీమ్ పెట్టి సర్వ్ చేయాలి
Review స్ట్రాబెర్రీ పైలో బైట్స్.