టాలెంట్.. ఎవరి టాలెంట్వారిదే.. సందర్భాన్ని బట్టి వారివారి టాలెంట్బయటపడుతుంటుంది. ముఖ్యంగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కోరకమైన టాలెంట్ ఉంటుంది. అయితే అది అవకాశం వచ్చినప్పుడు నిరూపించు కున్నప్పుడే వారి ప్రతిభ బయటకొస్తుంది. కొందరు అద్భుతంగా రాయగలరు, ఇంకొందరు పాడగలరు. మరికొందరు అద్భుతంగా ఆడగలరు. ఏదో ఒకరకంగా.. ఎప్పుడో ఒకప్పుడు వారి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఉచ్ఛారణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 40 వేల డాలర్లు సొంతం చేసుకుంది ఎన్నారై అమ్మాయి అనన్య వినయ్. వాషింగ్టన్‌లోని గేలార్డ్ నేషనల్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఉచ్ఛారణ పోటీల్లో 12ఏళ్ల అనన్య పాల్గొన్నది. మొత్తం 25 పదాలకు అనన్య పొల్లుపోకుండా స్పెల్లింగ్ చెప్పింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ఆమె మారోకెయిన్, మార్రం, గిఫ్బ్లార్, వేజ్గూజ్ తదితర పలు పదాలకు తడుముకోకుండా సమాధానం చెప్పగలిగింది. దీంతో విజేతగా నిలిచిన అనన్య విజేతగా నిలిచింది. ఆమెకు జ్ఞాపికతో పాటు 40వేల డాలర్ల నగదును బహూకరించారు. అయితే అనన్యతో పాటు చివరి వరకూ పోటీపడిన రోహన్రాజీవ్రన్నర్అప్గా నిలిచాడు.
ఐర్లాండ్ప్రధానిగా భారత సంతతి వ్యక్తి: లియో వరద్కర్..
తొలి స్వలింగ సంపర్క (గే) ప్రధానిగా, తొలి మైనార్టీ ప్రధానిగా రికార్డు..!
ఐర్లాండ్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి లియో వారద్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. 38 ఏండ్ల వయసున్న వారద్కర్ ఆ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా, స్వలింగ సంపర్కుడైన ప్రధానిగా కూడా రికార్డు
స•ష్టించనున్నారు. అధికార పార్టీ ఫైన్గేల్లో నాయకత్వం కోసం, తద్వారా ప్రధాని పదవిని అధిషి‘ంచటం కోసం జరిగిన ఓటింగ్‌లో వారద్కర్ 60 శాతం ఓట్లు పొందగా, ఆయన ప్రత్యర్థి సిమోన్ కొవెనీకి 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కొత్త ప్రధానిగా వారద్కర్ పేరు ఖాయమైంది. ఈ నెల 13న ఆయన పార్లమెంట్ విశ్వాసం పొందనున్నారు. లియో వారద్కర్ తండ్రి అశోక్ ముంబై వాసి. ఆయన ఇంగ్లాండ్‌లో ఐరిష్ నర్సు మిరియంను పెండ్లాడారు. వారద్కర్ జన్మించడానికి ముందు అశోక్ మిరియం దంపతులు ఐర్లాండ్‌కు వలస వెళ్లారు. లియో అక్కడ జన్మించాడు. వైద్యుడిగా స్థిరపడిన లియో రాజకీయాల్లోకి వచ్చి 27 ఏండ్ల వయస్సులో పార్లమెంట్లో తొలిసారి అడుగు పెట్టారు. స్వలింగ సంపర్కుడైన లియో వార్దకర్ జీవిత భాగస్వామి మాథ్యూస్ బర్రెట్ కూడా వైద్యుడే
Review స్పెల్లింగ్బీలో తెలుగమ్మాయి ప్రతిభ..!.