
మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
కోపము, స్థానచలనము, సౌఖ్యహాని, ప్రయాణ అసౌకర్యం. వ్యవహారములలో ఇతరుల సహకారంతో ముందంజ. సకాలంలో వనరుల సమీకరణ, సమయమునకు తగినట్టు వ్యవహరిస్తే ఇంటా బయటా సంతోషము, తగిన గుర్తింపుకోసం యత్నము.
వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
దుస్సాహసము, ఒళ్ళు చర్మముపై ప్రభావం. ఖేదము, ధనము, ఖర్చు, ఆదాయం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. సమయానుకూల కార్యనిర్వహణ, కలుపుగోలుతనము, మోకాళ్ళు ఎముకల విషయమై వైద్య సూచన, చికిత్సలు.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదా
లాభస్థానం రవి సంచారము ఆనందము, ధనము, ఐశ్వర్యము నిచ్చును. ధన ధాన్య, వృత్తి లాభము వ్యాపార నైపుణ్యము, అపనిందలు, అకాల భోజనం, రెండవ భాగములో పరిపూర్ణ ఆరోగ్యము, కీర్తి వృద్ధి. వృత్తి, వ్యాపారంలో విశేష లాభములు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లే
అధికార వృద్ధి, విస్తరణ, భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. భూలాభం కలుగుతుంది. కొంత అధైర్యం మిమ్ములను వెంటాడుతూనే ఉంటుంది. అయినా ముందుకు దూసుకుపోగలరు. ఉత్తర దేశ యాత్రలు కలసి వస్తాయి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార ప్రతిబంధకాలు, కాలం తత్సారమవుతుంది. సంతానం విషయంలో దిగులు, వారి కోసం అధికంగా ధనం ఖర్చు చేస్తారు. తీర్ధయాత్రలలో పాల్గొంటారు. ఆర్థిక నిర్వహణ తగుమాత్రం ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఉపశమనం.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు.
గత నెల కంటే అన్నింటా మేలు, ధనసమృద్ధి. ఊపిరితిత్తులు మొ।।న వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త. ఉన్నత విజ్ఞాన సముపార్జన, దేహపుష్టి, మృష్టాన్న భోజనం, ఇంట శుభకార్య నిర్వహణ, బంధుమిత్రుల కలయిక నూతన పరిచయాలు.
తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
గృహమున కళ్యాణాది శుభయోగములు బంధు మిత్రుల ఆనందోత్సాహాములు వారి సహాయ సహకారాలు. త్రిట, కాలవృధాయాపన అవిశ్రాంతి, విసుగు, ప్రయాణ భారము. సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రదక్షిణాలు చేయుట మంచిది.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జేష్ఠ
చేసే ఉద్యోగంలో ఉన్నతి అవకాశం. ధనసంపాదన పెరుగును. న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలం. తోటి ఉద్యోగుల ఉన్నతికి పాటుపడతారు. నూతన వాహనములు కొనుగోలు చేయుదురు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
గృహమున మంగళ తోరణములు, శుభకార్యములు, ఆకస్మిక ధనలాభములు, వివాహాది శుభకార్యములు కలసి రావడము, నూతన వస్తు వస్త్రాభరణములు ఖరీదు చేయుట, వాహన ప్రాప్తి, కీర్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశములు కలసి వచ్చును.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు.
మాతృ సౌఖ్యము, ధనధాన్య వివర్ధనం. స్వబుద్ధిచే ఉపక్రమించు కార్యములయందు జయము కలుగును. వృత్తి ఉద్యోగాలలో మార్పులున్నా, స్థాన చలనము, ఉన్నతి కలుగును. సంతానము అన్ని రంగాలలోనూ రాణిస్తారు.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయ దారులకు పంట దిగుబడి, ధనధాన్యాభివృద్ధి, పుత్రుల వలన సౌఖ్యము, వారివల్ల విదేశీ యానములు. ఇష్టకార్యసిద్ధి. కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవ
శరీరారోగ్యము, పై అధికారుల దర్శనము. శరీర పోషణము, ఇష్ట కార్యనిర్వహణ, కార్యసిద్ధి, కళ్యాణాది శుభయోగములు, మనస్సౌఖ్యము, స్త్రీల వలన లాభములు కలుగును. శృంగార పోషణము, భోగభాగ్యములనుభవించుట.
Review రాశి ఫలాలు.