వృత్తి వ్యాపారాల్లో ప్రతికూల వాతావరణం, అయిననూ కొత్త పంథాలో ఆదాయ సమీకరణము, కుటుంబ సౌఖ్యము, ప్రశాంతత. దూర ప్రాంత సందర్శన. విహారయాత్రలు, విందు వినోదములచే ఆనందము. ఇతరులకు సహాయపడగలరు.
వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
బంధుమిత్రుల సమాగమం, ఆనందము. గుహ్య అవయవములకు చికిత్స సూచన. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశములు. బాకీలు వసూలు, ఆర్థికంగా పరిపుష్టి, ప్రణాళిక ప్రకారం కార్యజయం. ధనవృద్ధి, మిత్ర సహాయం లభిస్తుంది.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
విద్యా వ్యాసంగములలో విశేష ప్రతిభ. ధాన్య వివర్ధనం, పుత్రపౌత్ర ప్రవర్ధనం. ఆపన్నులకు అందరికీ చేయూతనిచ్చి పైకి తీసుకువస్తారు. నూతన వ్యాపార పద్ధతుల వల్ల మంచి లాభాలు. కుటుంబ వాతావరణం ఆహ్లాదం, ప్రశాంతత.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లే
వృత్తి వ్యాపారాలలో మెలుకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అకాల భోజనం, నోటిపూత, రాజకీయనాయకులతో పరిచయాలు. సంతాన విషయంలో దిగులు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకోకుండా ఆగ్రహానికి గురవుతారు. వస్తు నాశనం, రక్తపోటు. ధనవ్యయం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఇంటికి సంబంధించి మరమ్మత్తులు. షేర్లు స్పెక్యులేషన్ కలసి వస్తుంది.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగ వ్యవహారాల్లో మార్పులు ఫలప్రదమవుతాయి. ఆకస్మిక ధనలాభం ధనం నిల్వ చేస్తారు. గృహ కొనుగోలు ఆలోచనలు ప్రణాళిక లుంటాయి. మిత్రుల సహకారం. కార్యక్రమాలను ధైర్యంగా పూర్తి చేయగలరు.
తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
దక్షిణ దేశయాత్రలు, పుణ్యకార్యాచరణ, జపహోమాది శత్రువులు, దానధర్మములు. ఉద్యోగోన్నతి, పై అధికారుల మెప్పు, చేయు వృత్తి వ్యాపారాలలో అనుకూలత, సమయానుకూలంగా వ్యవహరించి సమస్త కార్య జయము.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
నా సందర్శన, బంధువులు స్నేహితులతో కూడా గొప్ప సౌఖ్యము, దు:ఖనివారణము, ద్రవ్యలాభము, కులాచారమునకు తగ్గట్టు నడుచుకొనుట, విశేష ఆరోగ్యము, గురుభక్తి ఇష్టార్ధత, మనస్సుకు నిర్మలత్వము, వస్తు వస్త్ర లాభములు.
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
చేతినిండ పని దొరుకుట, ధనార్జనకు మార్గ సుగమం. కాంట్రాక్టులు, నూతన ప్రాజెక్టులు సాధిస్తారు. శరీర ఆరోగ్యము, మంచి లక్షణములు, మృష్టాన్న భోజనము, మధుర ఫలముల సేవనం, స్త్రీ సంపర్కము, సన్మానము, ఆనందము.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
ఆర్థిక ఇబ్బందులు తొలగును. సమయానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల వలన సహాయం. స్థానచలన సూచనలు. ఉదరసబంధ అనారోగ్యము. దత్తాత్రేయ, గురు గ్రహ పారాయణాలు మేలు చేయును. పవిత్ర నదీస్నానమ్.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కళత్ర సంబంధ అనారోగ్యము వైద్య శస్త్ర చికిత్సలు అవసరమగును. వైద్య సహాయం కలుగుతుంది. ఇబ్బంది ఉండదు. గృహ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. నూతన వ్యవహారాలను సాధించుటకు ప్రణాళికలు అమలు చేస్తారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆరోగ్యం విషయమై శ్రద్ధ అవసరం. ఊపిరితిత్తుల చికిత్స, వైద్య పరీక్షలు, వైద్య సహాయం లభిస్తుంది. అనారోగ్యం నుండి కోలుకుంటారు. గృహమున బంధువుల తాకిడి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
Review రాశి ఫలాలు.