రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
ప్రారంభంలో ధన లాభము, శారీరక, మానసికంగా మార్పులు. ఆలోచన విధానం మారుతుంది. యాత్రాస్థల సందర్శనము. పదిమందిని కల్సుకొని ముందుకు సాగుతారు. ధనం నిలబాటు. కళత్ర ఆరోగ్యం మెరుగవుతుంది.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
భూమి కొనుగోలు చేసే అవకాశం. ధనవృద్ధి ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగు. క్రింది వారితో ద్వేషభావం, సాంఘిక వ్యవహారాలలో తలదూర్చుతారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలుంటాయి.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
వంశాభివృద్ధి వార్తతో ఆనందం, క్రొత్త పథకాలు అమలులో నైపుణ్యత. కార్యజయం. మాస మధ్యలో ఒత్తిడి, ఉద్రేకం, వృత్తి రంగాలలో వ్యతిరేకత గ్రహించి ముందు జాగ్రత్త పడతారు. స్పెక్యులేషన్‍, ఆర్థిక గణాంక విద్యలు యోగిస్తాయి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేషా
విద్యా విషయాల్లో ముందంజ, గుర్తింపు, ఉన్నత విద్యాయోగములు. శుభకార్య నిర్వహణ, గృహమందు శుభపరంపరలు, శుభకార్యములకై ధనాన్ని విరివిగా ఖర్చు పెడతారు. పదిమందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సోదర బలం మీకు పెరుగుతుంది. వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది. మీరు చేసే వృత్తి కలసి వస్తుంది. ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు. చికిత్స, వైద్య సహాయము అవసరము ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు. ధైర్యంతో కార్యజయం.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
ధైర్యంగా చాకచక్యంగా కార్యక్రమ నిర్వహణ, నిలచిన పనులు నెరవేరును. వత్తిడి తగ్గును. ఆకస్మిక ధనలాభం. తగిన ఖర్చులు. నిలకడ. ధనం నిల్వ. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు. అన్నింటి ముందంజ. గృహంలో వాతావరణం ప్రశాంతం.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ధనధాన్యాభివృద్ధి, సుఖ సంతోసములు, ఆర్థిక నిర్వహణ మెరుగు. ప్రయాణములు కలసి వస్తాయి. నూతన వస్తు వస్త్ర ఆభరణములు కొనుగోలు. విందు, వినోదములు. ఇండ్లస్థలములు, భూమి కొనుగోలు అవకాశములున్నవి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
ఇంటియందు ఉత్సవము, ఉత్సాహము, గృహాచారములను పాటించుట, నిత్యం పరమాన్నము మొదలగు మధుర పదార్థ సేవనము, ధనధాన్య ప్రవృద్ధి. కీర్తి వర్ధనము, బంధు మిత్రులతో ఆనందము, మనస్సుకు సంతోషములు.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదలు
అలసత్వము, అనాచారము తొలగును. ఆశించిన దానికంటె మిక్కిలి ధనలాభములు. రాజకీయంగా పలుకుబడి పెరుగును. బంధుమిత్రులతో సంతోషం, సదా ఆరోగ్యం, రాజసంభాషణ, దర్శనం, అధికారులతో సత్సంబంధాలు.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయుదురు. విద్యార్థులకు వీసాలు మంజూరు అయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత చదువులు కలిసొస్తాయి.చేస్తారు.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఊపిరితిత్తులు గుండె సంబంధ అవయువములకు చికిత్సలు జరుగును. మధుమేహం అదుపులో
ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో అధికారుల ఆదరాభిమానాలు సంపాదిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు. ఆర్థిక నిర్వహణ మెరుగు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహోపయోగమునకు ధనము వెచ్చిస్తారు. విద్యార్థుల కృషికి తగ్గ ఫలితం. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top