రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
అజీర్తి వల్ల స్వల్ప అనారోగ్య సూచన. ధార్మికంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. రాజకీయంగా గుర్తింపబడతారు. దూర ప్రయాణములు చేయవలసి వస్తుంది.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
గృహ సంబంధ ఋణములు చేయవలసి వస్తుంది. కుటుంబములో పెద్దల ఆరోగ్యము అంతంత మాత్రం. ఇరుగుపొరుగు వారితో సత్సబంధములు. వస్తు భూషణములు, అలంకరణ వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యం.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
గృహనిర్మాణంలో జాప్యం. రాశి రీత్యా ప్రతిబంధక వాతావరణములు. అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆకస్మికంగా ధనం వస్తుంది ఖర్చవుతుంది. వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించు.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేషా
చండాల లక్షణాలు, సదరు దోషం, నిస్తేజం, తల, మెడ నరముల బలహీనత, నడుము సంబంధ చికిత్స. విద్యార్థులకు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాద
మాటతొందర. అందరికీ ఉపకారం చేయటానికి మీరు ముందుంటారు. రాజకీయంగా పైవారి సందర్శనం. గృహవాతావరణం అనుకూలం. నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంటుంది. విహారాలకు విందులకు డబ్బు ఖర్చు.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
నోటి తొందర, ధన విషయాలలో జాగ్రత్త. సమాజంలో గొప్పవారితో పరిచయ బాంధవ్యాలు పెరుగును. కృషికి తగ్గ గుర్తింపు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనుట. ధనం ఖర్చు, దైవారాధన, పుణ్యక్షేత్ర దర్శనం, విహారయాత్రలు.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ధైర్యము, మనస్సుకి ప్రశాంతర, చర స్థిరాస్తులు సంపాదిస్తారు. అన్నింటా జయం. తలచిన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దానం ఖర్చు తగుమాత్రంగా ఉంటుంది.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
అకార భోజనం, సాధజనముతో చుట్టములతో విరోధములు, కోపము, శరీరము యందు అనారోగ్యములు. సూర్యారాధన వలన దోష నివృత్తి బంధుమిత్రుల శుభకార్యములలో పాల్గొని ఆనందం పొందగలరు.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదాలు
వ్యవహార ప్రతిబంధకములను జయించి కార్య సాధన, దూర ప్రాంత ప్రయాణములు కలసివచ్చును. ధన సంపాదన బాగుంటుంది. రుణములను తీర్చగల్గుతారు. అప్పుల బాధ తగ్గుతుంది. విందు వినోదములలో పాల్గొంటారు.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతనంగా భాగ స్వామ్య వ్యాపారాలు కలసి వస్తాయి. ఏల్నాటి శని ప్రభా వాన్ని అధిగమించడానికి ఆంజనేయ సంబంధ ధ్యాన శ్లోకాలు పఠించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
రాజకీయంగా ఎదుగుదల. గత 3 నెలలుగా గృహ సంబంధ సమస్యలు తొలగి నిశ్చితంగా ఉంటారు. శుభకార్యములను వాయిదా వేయుట మంచిది. పోటీతత్త్యం పెరిగి తగువిధంగా స్పందించి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకుంటారు.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవ
బంధుమిత్రుల కలయికతో ఆనంద వాతావరణము. శుభకార్య నిర్వహణ. విద్యలో పిల్లలు ముందంజ, బహుమతులు గెలుస్తారు. కళత్ర సంబంధ అనారోగ్యం తగ్గుముఖం. నిలచిన బాకీలు వసూలు. ధనమునకు లోటుండదు.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top