రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
జనవరి లాగానే ఈ నెల గూడా మంచి – చెడు రెండూ ఉంటాయి. ప్రభుత్వ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. మొదటివారంలో ధన పరంగా బావుంటుంది. అప్పులు తీర్చగలుగుతారు. ఆస్థి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్థులు వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేస్తారు. భూమి వివాదాల కొనుగోలుకు అనుకూల సమయం. పాత మిత్రులను కలుసుకుంటారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రయాణాలు చేయొద్దు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. రెండో వారంలో, చాలా కాలం నుంచి ఆగిన పనులు ముందుకు కదిలి ఫలితాన్ని ఇస్తాయి. కొత్త మిత్రుల సహకారం లభిస్తుంది. దగ్గర వారితో ఏర్పడిన అభిప్రాయ బేధాలు పరిష్కారమవుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. వృత్తి-వ్యాపారాల్లో శ్రమ అనంతరం ఫలితం లభిస్తుంది. మూడవ వారంలో సంతానం, ఉద్యోగ విషయాలలో శుభవార్త మిమ్మల్ని సంతోష పెడ్తాయి. ఇంటిలో శుభకార్యాల సంరంభం మొదలవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. నాలుగో వారం నిదానంగా ఇప్పటిదాకా సాగిన పనులు ఊపందుకుంటాయి. ఇంటిలో ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది. దగ్గరి వారితో కలిసి, ప్రయాణాలకు ప్రణాళికలు వేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు: 1,8,9,10,18,19,20,27,28 సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యలు మొదటివారంలోనే తీరే అవకాశం ఉంది. ఇంట్లో సమస్యలు కూడా నెమ్మది నెమ్మదిగా తీరడం మొదలు పెడతాయి. రెండో వారం మొదట అనుకూలంగా ఉన్నప్పటికీ చివరలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఉదర వ్యాధులు బాధ పెట్టే అవకాశం ఉంది. మూడోవారంలో కొంచెం బద్దకం ఎక్కువగా ఉంటుంది. అది వదిలించుకుంటే ఉత్సాహంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వాతావరణ మార్పుల వల్ల శరీరం కొంత నీరస పడినా ఉత్సాహంగానే ఉంటారు. నాలుగో వారం అన్ని విధాలా బాగున్నప్పటికీ ఇంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వం చేసే కొన్ని నిర్ణయాల వల్ల మీకు కొంత లాభం ••లుగుతుంది. సామాజిక, ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు.
2,3,11,12,20,21,22 తేదీలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. హనుమాన్‍ చాలీసా పారాయణ మంచిది.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
మొదటి వారంలో పనులు ఆలస్యమైనా చివరికి పూర్తవుతాయి. స్వల్పంగా అనారోగ్యంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆడంబరాల కోసం ధనం ఖర్చు పెట్టకూడదు. అప్పులు ఇవ్వరాదు. రెండో వారంలో పాత సమస్యలు తీరుతాయి. ఏమైనా కొన్ని ఇబ్బందులున్నా వాటి పరిష్కారానికి కొంత ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల మార్పు కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలలో సావధానత అవసరం. మూడో వారం మరింత అనుకూలంగా ఉన్నప్పటికీ అజాగ్రత్త పనికిరాదు. వాపార లెక్కల్లో వారికి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ చివర్లో తేలిపోతాయి. ఆర్ధికంగా బావుంది కదా అని అధికంగా ఖర్చు పెట్టకూడదు. నాలుగో వారం గ్రహాల అనుకూలత పెరిగి అదృష్టం కలిసి వస్తుంది. జరుగుతున్న పనులు వేగంగా ముందుకు కదులుతాయి. ఆఫీసు పనిలో కూడా మంచి మార్పు వస్తుంది. సహుద్యోగులతో కలసి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 4,5,13,14,15,23,22 తేదీలలో జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీ అష్టకం పారాయణం చేయడం మంచిది.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మొదటి వారంలో మనసు సంచలంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. కొన్ని చికాకులు వేదిస్తుంటాయి. నిజంగా సమస్య లేకపోయినా అతిగా ఆలోచించటం జరుగుతుంది. ఆత్మ విశ్వాసం పెంచుకోవాలి. రెండో వారం మొదటి వారం లానే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా ఆరోగ్యం. అంతేకాక వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. కొత్త పనులు మొదలు పెట్టకూడదు. మూడవ వారం గ్రహ రాశుల మార్పు అంత అనుకూలం కాదు. ఆహార విషయంలో నియమాలు పాటించికపోతే అనారోగ్యం తలెత్తే సూచనలున్నాయి. కొంచెం జాగ్రత్త పాటించాలి. నాలుగో వారంలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చట్టాలను ఉల్లంఘించకూడదు. అన్ని చెల్లింపులు చివరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే చేయాలి. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు ఉండొచ్చు. ప్రభుత్వ నిర్ణయాలు కాని, వ్యవహారలు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన రోజులు: 6,7,16,17,25,26. లలితా సహస్త్ర పారాయణం చేయండి.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మొదటి వారం వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. భూమి, వాహనాలు, ఇళ్లు, మొదలైనవి అమ్మడం ద్వారా లాభపడతారు. పూర్వపు పెట్టుబడులపై లాభం వస్తుంది. కొత్త పెట్టుబడులకై ప్రణాళికలు వేస్తారు. పాత అప్పులు తీర్చుకునే అవకాశం దొరుకుతుంది. రెండో వారం శుభా శుభాలు మిశ్రమంగా ఉంటాయి. వారం మొదట్లో చాలా బావుంటుంది. చివర్లో కొత్త సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అనవసర వాద వివాదాలలో చిక్కుకోవద్దు. లేకుంటే కుటుంబ సమస్యల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. మూడో వారం మొదట్లో కొన్ని సమస్యలున్నప్పటికీ చివర్లో కాస్త వెసులుబాటు లభిస్తుంది. సంసారానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. ఆస్థుల క్రయ విక్రయాలకు గురించిన ఆలోచనలు సాగుతాయి.జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు: 1,8,9,10,18,19,20,27,28 ఆదిత్య హృదయం పారాయణ చేయండి.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
మొదటి వారం అన్ని విషయలలో పూర్వం మాదిరిగానే మీరు ప్రవర్తించాలి. కొత్త పనులు ఏమీ మొదలు పెట్టకూడదు. సంతాన విషయంలో కొన్ని చికాకులు నిదానంగా పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తాయి. రెండో వారంలో విద్యకు సంబంధించిన విషయాలు మినహా, మిగిలిన అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయంలో హెచ్చు తగ్గులుంటాయి. ఆడంబరాల జోలికి వెళ్లొద్దు. మూడో వారం అప్పటి దాకా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. నాలుగో వారం మూడో వారం కంటే బావుంటుంది. కాని వారం మొదట్లో కొన్ని సమస్యలు చికాకు పెడతాయి. చివరకు సర్దుకుంటాయి. అప్పుల విషయాలలో ఊరట లభిస్తుంది. అవసరమైన ధనం చేకూరుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహాలలో అనుకూలమైన తీర్పు వస్తుంది. నిరుద్యోగులకు అవకాశం లభిస్తుంది. 2,3,11,12,20,21,22 తేదీలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విశ్వనాథాష్టకమ్‍ పారాయణ చేయండి.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆరోగ్యం విషయంలో, వాద వివాదాలలోను జాగ్రత్త మొదటివారంలో చాలా అవసరం. అనుకోని సమస్యలు చుట్టుముడతాయి. నియమాలను ఉల్లంఘించకూడదు. రెండో వారంలో ప్రయాణాలు ఉంటాయి. అనుకోని చికాకులు ఎదురవుతాయి. పనులు అనుకున్న రీతిలో పూర్తికాకపోవడం వల్ల మానసిక చికాకు ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా కొంత అనుకూలత లోపిస్తుంది. మూడో వారం పూర్వం ఉన్న సమస్యలకు సమాధానాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనులలో అనుకూలత కనిపిస్తుంది. కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత చింత ఉంటుంది. నాలుగో వారం చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండవు. విద్యార్థులు ఏకాగ్రతను నిలుపుకోవాలి. ఇతర విషయాలపై ఆసక్తిని వదులుకోవాలి. వ్యాపార వర్గాల వాళ్లు ఆచి తూచి అడుగు వేయాలి.జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు: 4,5,13,14,15,23,24. గణపతిని పూజించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
ఆహ్లాదంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సహచరుల, మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారం మధ్యలో ఒకటి రెండు రోజులు ఇబ్బందులు ఉన్నప్పటికీ మొత్తం మీద బావుటుంది. రెండో వారం అనుకూలంగా ఉంటుంది. పనులు ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి కోపం తీవ్రంగా వస్తుంది. అటువంటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించాలి. మూడో వారం వాద వివాదాలలో నోరు జారకూడదు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటిలో సమస్యలు కొన్ని తలెత్తే ప్రమాదముంది. దాంతో మనస్సు వ్యాకులంగా ఉంటుంది. నాలుగో వారం వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి, జాగ్రత్త వహించాలి. వస్తువులు, భూములు, భవనాలు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా గమనించుకోవాలి. వారంతంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు: 6,7,16,17,25,26. హనుమంతుని పూజించండి.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
మొదటి వారంలో వాద వివాదాల జోలికి వెళ్లకూడదు. నోటిని అదుపులో ఉంచుకోవాలి. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓపిక అవసరం. జీవిత భాగస్వామి మీద ధ్యాస ఉంచాలి. రెండో వారం అనుకూలత కొంత పెరిగి, మంచి సమాచారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలు లాభిస్తాయి. విద్యార్థులు చదువుపై గట్టిగా దృష్టి పెట్టాలి. మూడవ వారం ఆటంకాలు తొలిగి పనులు పూర్తి అవుతాయి. ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. కోరుకున్న ఫలితం లభిస్తుంది. పెద్ద పెద్ద పనుల విషయంలో మీరు చేసే ప్రయత్నాలకు అనుకూల సూచనలు లాభిస్తాయి.1,8,9,10,18,19,20,27,28 తేదీలలో జాగ్రత్తగా ఉండాలి. శివ పూజ చేయాలి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
మొదటి వారం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు కూడా పున: సమీక్షించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. ఉత్సాహం, ఆత్మ విశ్వాసం రెంటిలోను హెచ్చు తగ్గులుంటాయి. రెండో వారం పనులలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. దానిని పెంచుకునే మార్గాల కోసం అన్వేషిస్తారు. ఆగిన పనులలో ప్రగతి కనిపిస్తుంది. కొన్ని కోరికలు తీరుతాయి. మూడో వారం వ్యాపారస్థులకు అనుకూలం. కొత్త అవకాశాల గురించి వారు ఆలోచన చేస్తారు. కోరుకున్న సహాయం వ్యక్తుల నుంచి లభిస్తుంది. నాలుగో వారం ఉత్సాహంగా పనులు మొదలు పెడతారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉద్యోగస్థులకు అనుకూల కాలం. అధికారులు, సహ ఉద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. నెల చివర్లో ప్రయాణాలు ఉండొచ్చు.2,3,11,12,20,21,22 రోజులలో జాగ్రత్త అవసరం. గురువులను, పెద్దలను పూజించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
మొదటి వారం మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. పనిచేసే చోట వాద వివాదాలలో చిక్కుకోకూడదు చట్టాలను అతిక్రమించకూడదు. సరైన పద్దతిలోనే ముందుకు వెళ్లాలి. రెండో వారం మొదటి వారం లాగానే పని ముందుకు కదలదు. వ్యాపారంలో కూడా వ్యవహారాలు నిదానంగా కదులుతాయి. వారంతంలో వెసులుబాటు కొంత దొరుకుతుంది. అనుకూలత పెరుగుతుంది. మూడో వారంలో పనులు నిదానంగా ముందుకు వెళ్తాయి. అనుకున్న ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. ఉద్యోగస్థులకు పైవారి, సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. నాలుగో వారం అన్ని విధాల అనుకూలం. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పనులలో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో ఇతరులకు నేతృత్వం వహించి మంచి ఫలితాలు సాధిస్తారు. అధికారుల మెప్పు.జాగ్రత్త తీసుకోవలసిన రోజులు 4,5,13,14,15,23,24. శివుని పూజ చేయండి.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మొదటి వారంలో సంతానానికి సంబంధించిన శుభ సమాచారం లభిస్తుంది. పెట్టుబడులు మంచి ఫలితాన్నిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగవచ్చు. విందు, వినోదాలలో పాలు పంచుకుంటారు. రెండో వారం చక్కగా ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మూడో వారం మొదట్లో కంటే చివర్లో ప్రతికూలత ఎక్కువ. పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నాలుగో వారం ప్రయాణాలు దైవ దర్శనం ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థలం మార్పు ఉండొచ్చు.జాగ్రత్తగా వుండాల్సిన తేదీలు: 6,7,16,17,25,26. హనుమాన్‍ చాలీసా పారాయణ చేయండి.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top