రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.జాగ్రత్తగా వుండాలి పాత అప్పులు తీరుస్తారు. ఆదాయం బావుంటుంది విదేశాల్లో చదవాలనుకునే విద్యార్ధులకు వీసాలు లభిస్తాయి.వ్యాపారస్ధులు అన్ని రకాల టాక్స్లను సమయానికి కట్టాలి. ప్రభత్వంతో పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. నెలలో చివరి రెండు వారాలలో ఆరోగ్యంక్షీణించే అవకాశాలున్నాయి.
మెదటివారం(ఒకటి నుండి7 ) కొత్త పరిచయాలు లాభాన్నిస్తాయి. తెలివితేటలతో అధికారుల మెప్పు సంపాదిస్తారు. వారం మెదట్లో కొత్త పనులను మొదలుపెట్టడం మంచిది. లాటరీలు, గుర్రపు పందాలు లాంటి వాటికి దూరంగా వుండాలి. దగ్గర వారి నుంచి ఆశించినంత సహాయం లభించదు. పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు.
రెండవ వారం: కొన్ని మంచి పనులలో మీరు పాలు పంచుకోగలుగుతారు మనుస్సు చెంచలంగా వుంటుంది తల్లి,భూమి,భవనాలకు సంబంధించిన విషయాలలో చికాకులు వుంటాయి. ఒప్పందాలకు, సర్దుబాట్లకు మంచి సమయం కాదు,వాయిదా వేయాలి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇంటికి సంబంధించిన వ్యవహరాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
మూడవ వారం: ఆరోగ్యం జాగ్రత్త, ఇంట్లో వ్యవహారాలు కుడా అంత బాగోవు, ముందుండి వ్యక్తులను నడిపించి పెద్ద పనులను పూర్తి చేయిస్తారు వారం మధ్యలో కుటుంబంలో ఉత్సాహ పురక వాతావరణం
ఉంటుంది. విద్యార్ధులకు ఈ వారం అనుకూలం. చివరి వారం: చేసే పనులలో లాభం వస్తుంది.ఇతరులతో మంచిగా వ్యవహరించి పనులు పుర్తి చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. వారం మధ్యలో, వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశలున్నాయి. జాగ్రత్త ఖర్చులకు అదుపులో వుంచుకోవాలి. తెల్ల ఆవుకు అరటిపండ్లు తినిపించండి అనుకూలం: 11,12,13,16,17,20,21 ప్రతికూలం: 4,5,6,14, 15,23,24

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఈ నెల మెదట్లో కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు,వృత్తి వ్యాపారాలకు సంబంధించిన సభలలో మీ ప్రతిభను చాటుతారు. అధికారుల అనుభవం మీకు
ఉపయోగిస్తుంది. కోర్టు వ్యవహారాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్త
మెదటి వారం: ఉత్యాహంగా,ఆనందంగా ఉంటుంది. మిత్రులు,సన్నిహితులను కలుసు కుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మెదట ఆటంకాలు ఎదురై చివరికి పని పుర్తవుతుంది ఉద్యోగ మార్పు లేదా స్థల మార్పు కోరుకునే వారికి అనుకూల సమయం
రెండవ వారం: పని మీద దృష్టి పెట్టాలి. పోటిదారుల విషయంలో జాగ్రత్తగా
ఉండాలి అకారణ వివాదాలు తలెత్త వచ్చు. షేర్‍ మార్కెట్‍వర్గాలు జాగ్రత్తగా వుండాలి.భార్యభర్తలు చిన్న చిన్న మాటలని పట్టించుకోకుండా వదిలేయాలి.
మూడవ వారం: ఆదాయం కొద్దిగా తక్కువ ఎగుమతి,దిగుమతి వ్యాపారస్థులకు ప్రతికూలంగావుంది కొత్త పనులు ముందుకు సాగవు. వారసత్వపు డబ్బు చేతికి అందే అవకాశముంది
నాల్గవ వారం: ఆర్దిక పరిస్దితులు,పిల్లల విషయాలు,చదువు విషయంలో మానసిక చింత ఏర్పడుతుంది. ఆకస్మికంగా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశము ఉంది. జాగ్రత్తగా వుండండి. ఆటంకాలు ఎక్కువటం వలన చికాకులు పెరుగుతాయి.
గణపతి ఆరాధన మించిది. అనుకూలం: 14,15,18,19,20,22,23 ప్రతి కూలం: 6,7,8,16, 17,25,2

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
దాంపత్యజీవనంలో కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. భార్య లేదా భార్య ఎక్కువ కోపావేశాలతోవుంటారు. ఉద్యోగంలో మార్పు వుండవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇంటికి దూరంగా వుండాల్సి రావచ్చు. దురప్రయాణాలకు అనుకూలం ఇంటి అమ్మకాలు కొనుగోలు లాభదాయంకంగా వుంటాయి.
మొదటివారం : ఆత్మవిశ్వాసం నిండుగా వుంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సహచరులతో కలిసి పనిచెయ్యలేకపోవచ్చు. కుటుంబంలో అబిప్రాయబేధాలు ఏర్పడతాయి. కొత్తఉద్యోగాలను చూచుకొనుటకు అనుకూలం. ఆఫీసు పనులలో పడి ఇంటి విషయాలలో శ్రద్ద పెట్టలేరు.
రెండవవారం: ఆలస్యంగా నడుస్తున్న పాత పనులను పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ ఆస్తులు వివాదాలు చర్చకు వస్తాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టడానికి అనుకూలం. అప్పులు తీరుస్తారు. పెద్ద నిర్మాణాలు చెయ్యాలా, వద్దా అనే ఆలోచనలో పడతారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనులు ఎక్కువగా
ఉంటాయి. రావల్సిన ధనాన్ని పొందటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్నం చేత ఆటంకాలు తొలగించుకోగలుగుతారు. భార్య భర్త మాటలను వినటం మంచిది.
చివరి వారం ఆరోగ్యం బానే వుంటుంది. కుటుంబం పరిస్థితి కూడ బావుంటుంది. పోటీదారుల వల్ల చికాకు ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలం. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం మంచిది
అనుకూలం. 16,17,21,22,24,25. ప్రతికూలం. 1,9,10,11,18,19,27,28

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ నెలలో ఉద్యోగులకు ఆర్ధికంగా గాని , పదవిపరంగానీ ఉన్నతి లభించవచ్చు. ఉద్యోగంలో ఇంతకు ముందున్న ఇబ్బందులు తొలగిపోతాయి. భూములు భవనాలు కొనటానికి అవసరమ్తెన ఋణాలు సమకూరుతాయి. ఎక్కువ డబ్బు విషయాల గురించి తీరిక లేని పనులవల్ల ఆరోగ్యం తగ్గుతుంది. మొదటి వారం: ప్రేమ వ్యవహారాలు అనుకూలం. అదృష్టం కలసివస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు. అతిగా కోపం తెచ్చుకోకూడదు. విద్యార్థులకు చాలా అనుకూలం. వ్యాపారస్తులకు కష్టపడక తప్పదు.
రెండవ వారం: మారుతున్న వాతావరణంవల్ల ఆరోగ్యంలో తేడాలు రావచ్చు. కష్టం ఎక్కువ లాభం తక్కువ ,ధర్మ కార్యాలకు దూరపు ప్రయాణాలకు డబ్బు ఖర్చు అవుతుంది. కొన్ని అనుకోని సంఘటనల వల్ల మీ కార్యక్రమలలో మార్పులు చోటు చేసుకుంటాయి.
మూడవ వారం: గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. తండ్రి గారితో సమయం గడుపుతారు. మిత్రులను కలవటానికి ఏర్పాట్లు చేసుకుంటారుౖ . ప్యాషను డిజైనింగు ఆర్కిటెక్చర్‍ చదివే విద్యార్థులకు అనుకూలం. షేర్‍ మార్కెట్‍లో పెట్టుబడులు పెట్టేముందు పూర్తిగా గమనించుకొని దిగాలి. చివరి వారం: ఎక్కువ తిప్పలు తప్పదు. అయిన ధైర్యంగా వుంటారు. పూర్వం ఆగిన పనులను పూర్తి చేస్తారు. మంచి లాభం మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది. లలితా దేవి పూజ చేయండి. అనుకూలం: 18,19,23,24,26,27,28. ప్రతి కూలం.2,3,11,18,13,21,29,30

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ రాశి వారికి ఈ నెల అంతా ఉరుకులు,పరుగులు తప్పవు. ప్రభుత్వోద్యోగులను కలుసుకోవటం, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువ స•మయాన్ని ఆక్రమిస్తాయి.ప్రభుత్వంలో పని చేసే వారికి కార్యభారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలసి విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు నెల మధ్యలో డబ్బు పరంగా బావుంటుంది. కుంటుంబంలో ఎదురయ్యే కష్టాలు,అభిప్రాయ భేదాల విషయంలో జాగ్రత్తగా వుండాలి.
మెదటి వారం: ప్రభుత్వ వ్యవహారాలు,చట్టాల నియమాల విషయంలో జాగ్రత్తగా వుండాలి. వ్యాపార విషయాలలో నిర్ణయాలు తీసుకోవటం అనవసరంగా ఆలస్యం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. దైవ పూజపై మనస్సు నిలుస్తుంది. ఆదాయం పెంచుకోవటానికి కొత్త మార్గాలు వెదుకుతారు.
రెండవ వారం: ఉత్సాహంగా ఆనందంగా వుంటుంది పనులు పుర్తి చేస్తారు. పనులలో విజయం లభించి మనస్సులో తృప్తిగా వుంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భావావేశానికి చోటివ్వవద్దు. వ్యవహార జ్ఞానంతో పనులు పూర్తి చేసుకోండి
మూడవ వారం: చెడు ఆలోచనలకు దూరంగా వుండండి ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలండి ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్త. వాహనాలు, భూమి, ఇళ్ళు మొదలైన విషయాలలో ఆటంకాలు తగ్గుతాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
నాల్గవ వారం:విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెంచుకుటారు, కుంటుంబపరంగా, డబ్బుపరంగా, కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు వస్తాయి.ఉద్యోగంలో కూడా అభివృద్ది కనిపిస్తుంది.
అనూకూలం: 1,2,3,20,21,25,26,29,30, ప్రతికూలం: 4,5,6,14,15,23
సోమవారం నాడు పేద పిల్లలకు పాలు పంచాలి.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
ఈ నెల కొన్ని విషయాలపై సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ఆటంకాలు ఎదురవుతాయి.ధన సంపాదన గురించిన చింత ఎక్కువవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు కనిపిస్తాయి. ఆ శుభకార్యపు ఏర్పాట్లకోసం డబ్బు ఖర్చువుతుంది. నెల మధ్యలో ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు నిలుస్తుంది.
మొదటి వారం: లో ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది కొన్ని పనులు కష్టం మీద
పుర్తవుతాయి. వాటిని పుర్తి చేసి మనశ్శాంతిని పొందుతారు. కుటుంబపరంగా ఖర్చులు పెరుగుతాయి. మిత్తులతో చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు, ఉద్యోగస్థులకు పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎన్నో అడ్డంకులు వాటిని అధిగమించటానికి పడే కష్టం వీటి అన్నింటి తర్వాత గూడా పనులు ముందుకు సాగవు. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి తండ్రి గారి కలిసి వచ్చే కాలం. విద్యార్ధులకు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేకాలం. ఉద్యోగస్థుల పనిభారం పెరుగుతుంది. మీడియా మరియు కమ్యూనికేషన్‍ రంగాలలో స్ధితి అనుకూలంగా వుండదు. మూడవ వారం : మొదట్లో పరిస్ధితులు కష్టంగా వుంటాయి అనవస•రపు ఆలోచన, వ్యాకులత ఎక్కువవుతాయి డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. కుదిరితే ఈ వారం డబ్బు వ్యవహారాలన్నీ పక్కన పెడితే మంచిది. వ్యాపార పరంగా విదేశప్రయాణాలు వుంటాయి వ్యాపార అభివృద్ది కోసం చేసే పనులు అనుకూలిస్తాయి.
నాల్గవ వారం: అనారోగ్యం తగుతుంది. సంతానంలో విభేధాలు రావచ్చు. ఉద్యోగస్థులు తమ కింద వారిని నమ్మి పనులు అప్పగించరాదు. విదేశాలలో వున్న వారు స్వదేశానికి తిరిగి వస్తారు, వారం మధ్యలో ఆర్థికంగా, సంతానపరంగా బావుంటుంది. అమ్మవారి పూజ చేసుకోవాలి.
అనుకూలం: 1.4.5.22.23.27.28, ప్రతి కూలం: 7,8,16,17,25

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఏప్రియల్‍ వ్యాపారపరంగా అంత అనుకూలం కాదు. కొద్దిపాటి లాభం కోసం కూడా అధికంగా శ్రమ పడవలసి వస్తుంది. ఇతర విషయాలన్ని వదిలిపెట్టి చేసే పని మీదే మనస్సు నిలపాలి. రియల్‍ ఎస్టేట్‍ సౌందర్య సాధనాలు, ఫ్యాషన్‍ ప్రపంచం, సినిమా లోకం మొదలైన సంబంధించిన పనులు చేసే వారికి ఈ మాసం కష్టంగానే గడుస్తుంది.
మొదటి వారం: ఉద్యోగస్థులకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి, పని పెరగటం, అవసరమైన అధికారం లేకపోవటంతో, మానసిక అశాంతి ఏర్పడుతుంది. ధైర్యంగా వ్యవహరించాలి వారం మధ్యలో,ఉన్నతాధికారుల నుంచి ఆశించిన సహాయం అందదు.
రెడవ వారం: సమయం అనుకూలం లేదు. ఏ విషయంలోను తొందరపాటు తగదు. తోఋట్టువులతో అనుబంధం గట్టి పరచటానికి మీరే ఎక్కువ ప్రయాస పడవలసి వస్తుంది. వ్యాపారం చేసే వారు ధైర్యంగా వ్యవహరించాలి.ఇతరులపై ఎక్కువ నమ్మకం వుంచద్దు.విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి.
మూడవ వారం : పెద్ద పెద్ద ప్రణాళికలు, వేసే ఆలోచన ఆపడం మంచిది కుటుంబంలో ఆప్యాయత సహకారం తగ్గుతాయి, వారం మొదట్లో సంతానం గురించిన శుభవార్త వింటారు. ఉద్యోగస్థులకు స్థల మార్పు లేదా దూరపు ప్రయాణాలు వుంటాయి.అప్పలు వసూల్లు తేలికగానే జరుగుతాయి.
నాల్గవ వారం : వైవాహిక జీవితం నిరాశగా వుంటుంది. ఆధ్యాత్యిక ఉన్నతి గురించిన ప్రయత్నాలు సాగుతాయి. తండ్రి గారి ఆరోగ్యం ఆందోళన కల్గించవచ్చు. సంసారంలో సుఖశాంతి కోసం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ఉద్యోగ మార్పు గురించి ఏ విధమైన ఆలోచనలు చేయవద్దు. ఆవు నేతితో ఇంట్లో రోజు దీపం పెట్టండి.
అనుకూలం :2.3.6.7.8.24.25.29.30, ప్రతికూలం: 9,10,11,18,19,20,27,28

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
ఈ నెల చాలా బావుంటుంది. ప్రారంభంలో ఆదాయం లాభం రెండు ఎక్కుగా
ఉంటాయి. చదువు విషయంలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూల సమయం. సమయం అనుకూలంగానే వుంది కానీ,కష్టపడితే గానీ ఫలితం రాదు ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలలో పాలు పంచుకుంటారు. మొదటి వారం: సొంత వృత్తుల వారికి గట్టి పోటి ఎదురవుతుంది. పెద్ద పెద్ద పనులు ఆలస్యంగా మొదలవుతాయి ఆధ్యాత్మిక విషయాలపై ఇష్టం పెరుగుతుంది. ఆర్ధిక స్ధితి మెరుగు పరుచు కోవడానికి చాలామందితో ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పులుంటాయి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. రెండవ వారం: భార్య,భర్తల మధ్య అనురాగం తగ్గుతుంది వారం మొదట్లో నిరాశ ఎక్కువగా వుంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ప్రేమ విషయాలలో జాగ్రత్తగా వుండాలి. కుటుంబంలో నిర్లిప్తత, అశాంతి వాతావరణం నెలకొని వుంటుంది
మూడవ వారం: సంతానార్థులకు పిల్లలు కలిగే అవకాశముంది. తండ్రి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అశుభవార్త ఒకటి వినవలసి రావచ్చు. గృహ నిర్మాణాల గురించిన పనులు మొదలుపెడతారు. పెద్ద మొత్తాలలో డబ్బును పెట్టుబడి పెట్టడం వల్ల లాభిస్తుంది. కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి.
నాల్గవ వారం: ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్ధితి క్షీణిస్తుంది చర స్ధిరాస్థుల అమ్మకాలు, కొనుగోలు విషయాలు ఈ వారం పుర్తిగా ఆపేయటం మంచిది వాహనాలు నడిపేటప్పడు జాగ్రత్త కుటుంబ బాధ్యతలు నెరవేర్చటానికి సమయం కేటాయించాలి. గోసేవ చేసుకోండి
అనుకూలం 4,5,6,8,10,26,27,28, ప్రతికూలం : 2,3,12,13,20,21,22,30

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
విద్యార్ధుల చదువుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. స్థిరాస్ధుల విషయమై రకరకాల పనులు సాగుతాయి మొదటి రెండు వారాలలో వాహనాల కొనుగోలు అమ్మకాలపై ఆలోచన సాగుతుంది దంపతుల మధ్య సఖ్యత, అనుకూలత కొంత తగ్గుతాయి. కుటుంబ ఖర్చులు కొంచెం పెరుగుతాయి. ఉద్యోగులకు, ఉన్నతాధి కారుల సహకారం లభిస్తుంది. మొదటి వారం: ప్రభుత్వ లేదా ప్రైవేటు సంప్ధలలో విధి విధానాలను రూపొందించే వారికి చాలా మంచి సమయం ఉద్యోగులకు తన కింద పని చేసే వారికి సహాయం లభిస్తుంది. పనిలో భాధ్యత ఎక్కువ, అధికారం తక్కువ వుటుంది వ్యాపారస్థ్ధులు కొంత ఆర్ధిక ఇబ్బంది ఎదుర్కోవలసివస్తుంది ఆకలి మందగించటం, ఆహారం రుచించకపోవటం లాంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
రెండవ వారం: తమ ప్రణాళికలను విజయవంతంగా అమలుచేస్తారు శుభకార్యాల విషయమై ధనం ఖర్చు పెడతారు. ధన లాభం కూడా వుంది. సంపన్నుల వలన లాభం కాని, కొత్త మిత్రులు దొరకటం గాని జరుగుతుంది. ఆర్థిక స్ధితి భావుంటుంది వారం మధ్యలో పనులు గానీ, థనాదాయం గానీ, సామాన్యంగా ఉంటాయి. మూడవ వారం: మొదట్లోనే, భవిష్యత్తులో నిర్మించే భవనాల విషయాలు ఎటు ముందుకు సాగవు రోజు వారి పనిచేసుకునే వారికి ధనం లభించటం గానీ,ఉద్యోగంలో ఉన్నత పదవి ప్రాప్తి గానీ వుండవచ్చు. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. కొత్త మిత్రుల గురించిన ఆలోచన సాగుతుంది. వారం చివర్లో శత్రువులపై విజయం లభిస్తుంది ధన ప్రాప్తి వుంది ఈ వారం పై చదువులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎంతో అనుకూలం. విధ్యార్థులు మంచి చదువు కోసం ఇల్లొదిలి నగరాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్ళటానికి మంచి కాలం. షేర్‍ మార్కెట్‍కు దూరంగా వుండాలి ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకునేటప్పడు మోసాలు జరిగే అవకాశముంది జాగ్రత్తగా వుండాలి. హనుమాన్‍ చాలీసా పారాయణ చేయటం మంచిది. అనుకూలం:1,2,3,7,8,11,12,13,29,30, ప్రతికూలం : 4,5,14,15,20,23,24

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ నెల ఎంతో అనుకూలం ఉద్యోగస్ధులకు పై అధికారుల సహయం లభిస్తుంది వ్యాపారప్రదేశాలను అలంకరించటానికి ఎక్కువ ఖర్చు పెట్ట వలసి వస్తుంది. జీవితంలో అభివృద్దికి కోత్త మార్గాలు దోరుకుతాయి. ఈ నెలలో భగవత్‍ చింతన,దెవతా దర్మనం అందుతాయి నిదానంగా డబ్బు చేతికి అందుతుంది నెల మధ్యలో ఇంటిలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశముంది. మొదటి వారం : ప్రభుత్వ విషయంలో చిక్కులు వస్తాయి పిల్లల ఆరోగ్యం జాగ్రత్త అదృష్టం మీ వెంటే వుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తినే ఆహరం విషయంలో జాగ్రత్తగా వుండాలి దగ్గరి బంధువులను కలుసుకుంటారు ఉదోగ్యగులకు బాధ్యతలు,పనిభారం పెరుగుతుంది
రెండవ వారం: వ్యాపారస్ధులకు ఈ వారం అంత అనుకూలం కాదు దూర ధేశాలకు వెళ్ళటం,స్ధలం మార్పు, వేరే చోటకి బదిలి అవ్వటం లాంటివి మాములుగా జరిగిపోతాయి కానీ, పై అధికారులతో అభిప్రాయ భేధాలు వస్తాయి స్ధల మార్పు కూడా కోరుకున్న చోటకి జరగదు వారం చివర్లో విద్యార్ధులకు చదువులో ఇబ్బందులు ఎదురవుతాయి మొదటి సగ భాగం ఎక్కువ అనుకూలం,స్నేహితులతు కలసి విందు వినోదాలలో పాల్లోంటారు అందరు కలసి కోత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అను•కూంటారు ఒక ప్రత్యీకమైన పని విషయంలో మిత్రుల ,పరిచయ స్ధల సహయం భాగా అందుతుంది వారంలో సన్మినాలు పొందే అవకాశముది.
నాల్గవ వారం: భూమి, భవనాలకు సంబందించిన విషయాలలో ఏ నిర్ణయాలు తీసుకోకుండా వుండాలి. సంతాన విషయంలో గట్టి నిర్ణయాలె తీసుకోవలపి వుంటుంది తీర్ణయాత్ర స్ధలాలలొ దానాలు, దక్షిణాలు చేయవలసి అవసరం వస్తుంది వారం మధ్యలో కోంత స్తబ్ధత ఏర్పడుతుంది దుర్గాదేవి పుజ చేసుకోవాలి. అనూకూలం: 4,5,9,10,11,14,15 ,పతికూలం: 7,8,16,17,24,25,26

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఈ నెల మొదట్లో ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేయాలి. చక్కని తెలివితేటలు పనితీరు చూపిస్తేగాని అనుకున్నది సాధించలేరు. అతికష్టం మీద పెద్ద పనులు పూర్తి చేయ గలుగుతారు. పై అధికారులు పని తీరును మెచ్చుకుంటారు. పనులు పూర్తి అవుతాయి ప్రేమికులు తమ అనుబంధ•ం విషయంలో ధైర్యంగా వుండాలి. డాక్టర్లు, లాయర్లుకు అనుకూలం. మొదటి వారం: జీవిత భాగస్వామితో వాద, వివాదాలకు దూరంగా వుండాలి. లేకుంటే పరిస్థితి దిగజారుతుంది.పెద్దకంపెనీలలో పనిచేసే ఉద్యోగులు సభలలో ప్రసం గించాల్సిన అవసరం పడుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. తల్లికి ఈ వారం అంత అనుకూలంగా వుండదు. అనుకున్నది సాధించటం కోసం విద్యార్ధులు చదువు మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. రెండవ వారం: ఆర్ధికంగా ఓ మాదిరి అనుకూలంగా వుంటుంది. ఉద్యోగులపై పెరుగుతుంది వారం మొదట్లో అనుకోని ఇబ్బందులు చుట్టు ముడతాయి భార్య భర్తల బంధం మరింత ధృడ పడుతుంది నిరుద్యోగులకు మంచి రోజులు వస్తాయి మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. మూడవ వారం: వారం మొదట్లోనే ధనాదాయం బావుంటుంది. నిదానంగా పనులలో విజయం లభిస్తుంది పెస్థ్ధాయి వారి మద్దతు కుడగట్టుకుంటారు.ఇతరులతో కలిసి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. చెడ్డ ఆలోచనలను దూరం పెడ్తారు. నాల్గవ వారం:అతికష్టం మీద సమస్యలనుంచి బయట పడ్తారు ధనపరంగా అనుకూలం కాదు, ఉద్యోగం మారాలి అనుకుంటే వారం చివర్లో ప్రయత్నించాలి. కొత్త ఉద్యోగంలో చేరే వారు తమ జీవనశైలిలో మార్పుచేసుకోవాలి. చెడు ఆలోచనలను దూరం పెట్టాలి. సూర్య ఆరాధన చేయాలి. అనుకూలం:9,10,14,15,18,19, ప్రతికూలం: 1,2,3,12,13,21,22,29,30

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top