మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
ఈ నెల దూర ప్రయాణాలు అధికంగా ఉండటం వల్ల శరీరం అలసిపోతుంది. అనారోగ్యం ఇబ్బంది పెడ్తుంది. శత్రువులు హాని చేయాలని చూస్తారు. వ్యాపారాలు సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెడ్తారు. నెల మధ్య నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నెల చివర్లో ఉద్యోగంలో కోరుకున్న అభివృద్ధి పొందగలుగుతారు. మొదటివారం 1-7లో తీర్థయాత్రలు చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెడ్తారు. సంతానం వల్ల లాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళవచ్చు. మిత్రులను మరీ ఎక్కువ నమ్మకండి. వ్యాపారులు కొత్త పనులు మొదలు పెడ్తారు. వారం చివర్లో ఉద్యోగంలో ఇబ్బందులుంటాయి. శుభకార్యాల కోసం ధనం వ్యయం. 8-14 రెండవ వారంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాలలో కలసి వస్తుంది. సమాజంలో మీ వ్యక్తిత్వానికి బాగా గుర్తింపు లభిస్తుంది. భూమి, భవనాలు సంపాదిస్తారు. ఆనంద విహారాల కోసం డబ్బు ఖర్చు పెడ్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంది. కుటుంబం నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. వారం చివర్లో జీవిత భాగస్వామితో కలిసి సరదా ప్రయాణాలు చేస్తారు. 15-21 ఈ వారంలో ఉద్యోగంలో కోరుకున్నది లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలకు ఏర్పాటు జరుగుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. పై అధికారులతో మాట తేడా వస్తుంది. పదవీ, గౌరవాలకు సంబంధించిన బాధ వుంటుంది. తండ్రిగారి ఆరోగ్యం జాగ్రత్త. 22-30 ఈ వారంలో దూరపు ప్రయాణాలు, సామాజిక, ధార్మిక కార్యకలాపాలతో పాలుపంచుకోవటంతో ఈ వారమంతటా బిజీగా వుంటారు. డబ్బు నిదానంగా చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షలు రాసేవారు బాగా కష్టపడి చదవాలి. సుబ్రహ్మణ్యాష్టకమ్ రోజూ చదువుకోవాలి. మంచి రోజులు: 5,6,10,11,14,15 ప్రతికూల దినాలు: 8,9,16,17,25,26.
వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
చిన్న ప్రయాణాలు చేసే యోగం ఉంది. విద్యార్థులకు కొంచెం కష్టకాలం. బాగా కష్టపడితేనేగానీ నెగ్గలేరు. తండ్రికి కలసిరాని సమయం. జాగ్రత్తగా ఉండాలి. నెల మధ్యలో దాంపత్య జీవనంలో ఇబ్బందులు వస్తాయి. అనవసరపు, వాగ్వాదాలకు దిగవద్దు. సొంత వూరికి దూరంగా వుండాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలనుకు అనుకూల సమయం. 1-7 ఈ వారంలో అనవసరపు ఆలోచనలు, నిరాశ ఇబ్బంది పెడ్తాయి. విద్యార్థులకు చదువుపై దృష్టి నిలవదు. ఆత్మవిశ్వాసం, సరైన ఆలోచన తగ్గుతాయి. వాహనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వుండాలి. అకస్మాత్తుగా దెబ్బలు తగలవచ్చు. ఉద్యో గస్థులు పై వారి మెప్పు పొందుతారు. జాగ్రత్తగా అభివృద్ధి వైపు ముందడుగులు వేయటానికి ప్రయత్నిస్తారు. 8-14 షేర్‍మార్కెట్‍కు దూరంగా ఉండాలి. పిల్లలకు సంబంధించిన విషయాలు మీమీద మరింత బరువును పెంచుతాయి. ఉద్యోగపరంగా అకస్మాత్తుగా వేరేచోటకి వెళ్ళవలసి వస్తుంది. పనిభారం, అటు ఇటు తిరగటం, ఒత్తిడి వల్ల అలసట పెరిగి విశ్రాంతి దొరకదు. వారం మధ్యలో నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. 15-21లలో కొత్త ప్రేమలు పుట్టుకు వస్తాయి. విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. తీర్థయాత్రలకు ఏర్పాటు చేసుకుంటారు. పాత పనులు పూర్తవుతాయి. చేస్తున్న పనులలో వాద వివాదాలకు దూరంగా వుండండి. పనులు నిదానంగా పూర్తవు తాయి. కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది. ఉద్యోగంలో పైస్థాయిని అందుకుంటారు. 22-30 ఈ వారంలో ఇచ్చిపుచ్చుకోవటంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలలో మాట కంటే రాతకే ప్రాధాన్యత ఇవ్వాలి. గొప్ప వ్యక్తులను కలుస్తారు. వారితో పరిచయం భవిష్యత్తులో ఎంతో ఉపయోగిస్తుంది. విద్యార్థులలో ఏకాగ్రత తగ్గుతుంది. శివస్తోత్ర పారాయణం మంచి చేస్తుంది. శుభదినాలు: 7,8,9,12,13,16,17 అశుభదినాలు: 1,2,10,11,18,19,27,28,29.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
విదేశాలలో చదువుకోవాలనుకునేవారికి అనుకూల సమయం. విదేశాలలో వున్నవారి సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలకు ప్రణాళికలు వేస్తారు. తల్లిగారి ఆరోగ్యం ఇబ్బందిగా వుంటుంది. నెల మొదట్లో దాంపత్య జీవితం కష్టంగా వుంటుంది. ఖర్చులు అధికం అవుతాయి. ప్రేమికులకు మంచి సమయం. డబ్బులు అప్పులు ఇవ్వటం ఈ నెలలో చేయకుండా వుండటం మంచిది. 1-7 మొదటి వారంలో, అతి సాహసం పనికి రాదు. కొత్త పనులు బాగా ఆలోచించి మొదలు పెట్టాలి. వారం మొదట్లో రెండు రోజులు బాగా ఇబ్బంది పెడ్తాయి. ధైర్యంగా పని చేస్తూ ముందుకు వెళ్తేనే పనులు పూర్తవుతాయి. కానీ లాభం మాత్రం ఆలస్యంగా లభిస్తుంది. తండ్రి ఆరోగ్యం జాగ్రత్త. పనివారి యొక్క సహకారం బాగా లభిస్తుంది. 8-14లలో పత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు బద్ధకం వదిలించుకోవాలి. తొందరపాటుతనంతో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుబడులు పెట్టడం గురించిన ఆలోచనలు వదిలేయాలి. వారం మధ్యలో వ్యాపారులలో నిరాశ పెరుగుతుంది. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు ఏకాగ్రతను నిలుపుకోవాలి. 15-21లలో పెద్ద నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది. పోగు చేసిన డబ్బులు కుటుంబం కోసం భారీగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అత్తగారితో గొడవలు వచ్చే అవకాశాలున్నాయి, జాగ్రత్త. ఆదాయం మామూలుగా ఉంటుంది. ఉద్యోగస్థులకు మంచి కాలం. 22-30 విద్యార్థులు చదువుపై దృష్టి పెడ్తారు. వ్యాపారస్థులకు కూడా తలచిన పనులు పూర్తవుతాయి. స్థిరాస్థుల కొనుగోలుకు సమయం అనుకూలం. ప్రభుత్వం పన్నులు లాంటి వ్యవహారాలు ఇతరుల సహాయంతో పూర్తి చేసుకోగలుగుతారు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి.
శుభదినాలు: 10,11,14,15,18,19 అశుభదినాలు: 2,3,4,12,13,20,21,22,30.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ నెల జీవితంలో మార్పు కోరుకునేవారికి చాలా అనుకూలంగా వుంటుంది. ఉన్నత పదవి లభిస్తుంది. పిల్లల విషయాలు చికాకు పెడ్తాయి. వాహన సౌఖ్యం ఉంది. పోటీ పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఎక్కువ శ్రమ పడాల్సిందే. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల వ్యాపారస్థులకు లాభం కలుగుతుంది. నెల మధ్యలో జీవిత భాగస్వామి నుంచి కావాల్సినంత సహకారం లభించదు. 1-7 కొత్త ఉత్సాహం పొంగిపొరలుతుంది. వారం మొదట్లో రెండు రోజులు ధార్మిక విషయాలపై బాగా ఆసక్తి కలిగి వుంటారు. ఆవేశం లేదా కోపం వల్ల ఇతరులతో అనుబంధం చెడకుండా చూసుకోవాలి. కొత్త వ్యాపార భాగస్వాములను ఎన్నిక చేసుకోవటం కోసం ఈ వారం చాలా మంచిది. 8-14లలో పెద్ద పెద్ద వ్యాపారభాగస్వామ్యం ఉపకరిస్తాయి. కమ్యూనికేషన్ రంగంలో వున్నవారు మాటమీద అదుపు ఉంచుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవ్వవచ్చు. కడుపులో మంట, జలుబు, రక్తపు పోటు లాంటివి ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తి, వ్యాపారాలలో వారం మధ్యలో బాగా శ్రమ పడవలసి వస్తుంది. 15-21 ఈ వారంలో విద్యార్థులకు కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఈ వారంలో విద్యార్థులకు కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. తమ్ముళ్ళు, చెల్లెలుతో ఒక విషయం తేడా వస్తుంది. రాజకీయాలలోని వ్యక్తులకు అనుకూల సమయం, వ్యాపారాలు మరింత లాభం పొందాలని ప్రయత్నం చేస్తారు. 22-30లలో వారసత్వ ఆస్థుల విషయంలో వివాదాలు నెలకొంటాయి. అనుకూలత తక్కువ ఉంటుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. వారం మొదట్లో అంతా కలిసి వస్తుంది. ఉద్యోగస్థులకు అధికారాలు తగ్గుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. అమ్మవారి పూజ చేయండి. పేదలకు అన్నం పెట్టండి.
శుభదినాలు: 12,13,16,17,20,21 అశుభదినాలు: 5,6,7,14,15,23,24.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ నెల డబ్బులకు సంబంధించి వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయాలి. భార్య లేదా భర్తకు కుటుంబ బాధ్యతల విషయంలో అసంతృప్తులు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. ధైర్యం, సహనంతో పనులు పూర్తిచేసుకోవాలి. మనోబలం, ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటాయి. నెల మధ్యలో పూర్తిగా ఆగిన పనులు పూర్తవుతాయి. 1-7 మొదటి వారంలో మానసిక అశాంతి, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఉద్యోగస్థులు పనులు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితంపై దృష్టి పెట్టవలసిన అవసరం వుంది. సాధ్యమైనంత వరకు పెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదు. 8-14లలో ఉద్యోగస్థులకు స్వార్థచలనం కనిపిస్తోంది. వ్యాపారాలు మధ్యరకంగా సాగుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. ఉన్నత విద్యకు వెళ్ళగలుగుతారు. వారం మధ్యలో వృత్తి, ఉద్యోగాల వల్ల మానసిక చింత వుంటుంది. అనవసరపు ఖర్చులను అదుపు చేసుకో గలుగుతారు. 15-21 ఈ వారంలో కోపం, ఆవేశం అదుపులో పెట్టుకోవాలి. స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం సరదాగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇల్లు లేదా వ్యాపారస్థలం లేదా వాహనాలపై డబ్బు ఖర్చు చేస్తారు. వారం మధ్యలో ఒక విషయం మిమ్మల్ని మానసిక అశాంతికి గురి చేస్తుంది. 22-30 ఈ వారంలో, కుటుంబ సమస్యలు గట్టి ప్రయత్నం చేత దూరమవుతాయి. రక్తపు పోటుతో బాధపడేవారు ఆహార విషయంలో శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వ పరంగా చిక్కులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్థులకు ఉన్నత పదవి ప్రాప్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.
శుభదినాలు: 14,15,18,19,22,23,24 అశుభదినాలు: 7,8,9,16,17,25,26.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్త. కంటి సమస్యలు, జీర్ణసమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగస్థులకు బద్ధకం పనికిరాదు. ఆదాయం, లాభాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సంతానానికి విజయం లాభిస్తుంది. వారు పోటీ పరీక్షలలో నెగ్గుతారు. కొత్త పనులు మొదలు పెడతారు. నెల చివర్లో కొంత కష్టం తరువాత లాభాలు చేతికి అందుతాయి. 1-7 మొదటివారంలో జీవిత భాగస్వామికి ఆరోగ్యం కాస్త తగ్గుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాహనాలు జాగ్రత్తగా నడపాలి. సహోద్యోగుల వల్ల మనస్తాపం. లాభాలకంటే అనుబంధాలమీద దృష్టి ఎక్కువ పెట్టాలి. మామగారి వైపు నుంచి ఆశించిన సహాయం లభించవచ్చు. 8-14 ఈ వారంలో వృత్తిపరంగా దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చికిత్స కోసం డబ్బులు ఖర్చు పెడతారు. వారం మొదట్లో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదాయపరంగా అంత అనుకూలం కాదు. అనవసరపు ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. వారం మధ్యలో ఆర్థికంగా, సంతానం విద్యాపరంగా బావుంటుంది. 15-21, వైవాహిక జీవితం బావుంటుంది. అవివాహితులకు పెళ్ళి కుదురుతుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు. అప్పటిదాకా మిత్రులుగా వున్నవారు ప్రేమికులుగా మారతారు. ఉద్యోగస్థుల మీద పనిభారం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా వుంటుంది. 22-30, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కార్యక్షేత్రంలో విరోధులను ఓడిస్తారు. బాధలు వున్నప్పటికీ వా•ంతట అవే తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది. దేవాలయంలో సేవ చేయండి.
మంచి రోజులు : 16,17,20,21,22,25,26 అశుభదినాలు: 1,2,10,11,18,19,27,28.
తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఈ నెలలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో ఉప యోగిస్తాయి. నెల మొదట్లో అన్ని విషయాలలో అవరోధాలు కనిపిస్తాయి. వాటినుంచి బయటపడటానికి ధార్మిక విషయాలపై దృష్టి పెట్టాలి. కష్టపడి కుటుంబ ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ అవసరాలను పూర్తి చేయటం కోసం ఈ నెలంతా కూడా ప్రయత్నం చేస్తారు. 1-7 మొదటి వారంలో, విద్యా, బ్యాంకింగ్, సంబంధిత వృత్తులు చేసేవారు జాగ్రత్తగా వుండాలి. వృత్తి ఉద్యోగాలలో ఒక మాదిరి నుంచి భారీగా సమస్యలు ఎదుర్కొన్నాకే ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. వారం మధ్యలో ఆదాయం బావుంటుంది. సమాజ సేవకోసం డబ్బులు ఖర్చు పెడతారు. 8-14 పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తారు. సమాజ సేవ కోసం డబ్బు ఖర్చు పెడతారు. ఈ సమయంలో మానసిక వ్యాక్యులత ఎక్కువ ఉంటుంది. ఆలోచనలు సరిగా సాగవు. ఆరోగ్యం జాగ్రత్త. 15-21 ఈ వారం మొదట్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవచ్చు. దాంపత్య జీవితం బావుంటుంది. భాగస్వామ్య వ్యవహారాలు చికాకు పెడతాయి. ఉద్యోగస్థులకు మధ్యస్థంగా వుంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు విజయం లభిస్తుంది. 22-30 చట్టాలు, న్యాయానికి సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది ఎక్కువ ఉంటాయి. పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితులతో, పెద్దలతో జాగ్రత్తగా మాట్లాడాలి. పూర్వం ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పేదలకు అన్నదానం చేయండి.
శుభదినాలు: 1,18,19,23,24,27,28,29 అశుభదినాలు: 3,4,12,13,20,21,30.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
ఆర్థికంగా, కుటుంబపరంగా జాగ్రత్తగా వుండవలసిన సమయం. సమాజపరంగా గూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వాదవివాదాలు, గొడవులలో ఇరుక్కోకండి. జీవిత భాగస్వామి, బంధువుల నుంచి ఇబ్బందులు రావచ్చు. ప్రతి నిర్ణయం బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. మానసిక చింత, చికాకు, కోపం ఎక్కువవుతాయి. 1-7 ఈ వారంలో పనులను, ధార్మిక దృష్టితో చేయాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బద్ధకం వదిలిపెట్టాలి. ఉత్సాహంగా దూసుకువెళ్ళాలి. అప్పుడే వ్యాపారాలు ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. ఆలోచనలు పక్కనపెట్టి బాధ్యతలను నెరవేర్చాలి. విద్యార్థులలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం కొరవడతాయి. 8-14 శత్రువులు బలంగా వుంటారు. విరోధులను శాంతపరచటానికి బాగా కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగులపై అనవసరపు ఒత్తిడి వుంటుంది. ప్రేమ విషయాలు ముందుకు కదులుతాయి. వారం మధ్యలో ఉద్యోగులు జాగ్రత్తగా తమ పనులు చేయాలి. 15-21 ఈ వారంలో హెచ్చుతగ్గులు ఎక్కువ. ఆకస్మికంగా ధనలాభం వుండే అవకాశముంది. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. భాగస్వామ్య వ్యవహారాలు విస్తరిస్తాయి. పదవి, ప్రతిష్ఠ పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేయటానికి అనుకూల సమయం. నీటికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశముంది, జాగ్రత్త. మంగళవారం పూట హనుమంతునికి ఆకు పూజ చేయండి.
శు.ది : 2,3,4,20,21,25,26,30 అశుభదినాలు: 5,6,7,14,15,23,24.
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
శుభాశుభ మిశ్రమంగా వుంటుంది. మొదటి సగం శుభంగాను, మిగిలిన 15 రోజులు ఇబ్బందితోనూ గడుస్తాయి. నెల మొదట్లో వ్యాపారంలో లాభాలు వస్తాయి. చేసే పనిలో, స్త్రీల సహకారం లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ వనరుల ద్వారా ఆదాయం లభిస్తుంది. మొదటి రెండు వారాలు ఆరోగ్యం బావుంటుంది. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులుంటాయి. కడుపులో నొప్పి, ఆకలి మందగించటం లాంటి సమస్యలు రావచ్చు. 1-7 సంతానానికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఆలోచించవలసి వస్తుంది. లాభాలు బావుంటాయి. పెద్ద పని ఒకటి చేతికి అందుతుంది. పనిలో వున్న సమస్యలు, కష్టపడి వదిలించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు వున్న వ్యక్తులతో పరిచయం పెంచుకోవటం వలన ఉపయోగం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు చేసుకోగలుగుతారు. పిల్లలకు సంబంధించిన విషయాలపై కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. 8-14 ఈ వారంలో వృత్తిలో ఎదుగుదలకు అవకాశం లభిస్తుంది. తెలివితేటలతో పనిచేసి లాభం పెంచుకుంటారు. పాత పెట్టుబడుల వల్ల మంచి లాభం సంపాదిస్తారు. వివాదాలు ఎదురైనా కోర్టుదాకా వెళ్ళకుండా జాగ్రత్త పడండి. మాట తూలటం వల్ల నష్టం వచ్చే అవకాశం వుంది జాగ్రత్త. 15-21 కుటుంబంలో ఒకటి అన్యాయం వల్ల ఇబ్బంది పడ్తారు. గొప్ప పనులు చేయాలన్న ప్రయత్నం ఫలిస్తుంది. రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటారు. పదవిలో ఉన్నవారి వల్ల లాభం పొందుతారు. వారం మధ్యలో ప్రేమికులు అతిగా వ్యవహరించకూడదు. వారం చివర్లో ఆగిన పనులు పూర్తవుతాయి. 22-30 ఆఖరి వారంలో ఎప్పటినుంచో ఇబ్బంది పెడ్తున్న ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు వదిలిపోతాయి. సరైన ఆహారం, విశ్రాంతి లభించడంలో ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
శు.ది: 1,2,5,6,22,23,24,27,28,29 అశుభదినాలు: 8,9,16,17,25,26.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
ఈ నెల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపారస్థులు ఆచితూచి అడుగు వేయాలి. ఇంతకు ముందున్న ఇబ్బందులు, సమస్యలు తగ్గుముఖం పడతాయి. అప్పులు సమస్యగా మారతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గటం వల్ల కొంత హాయిగా అనిపిస్తుంది. సమాజంలోని వ్యక్తులతోను, రాజకీయ నాయకులతోను అనుబంధాలు పెరుగుతాయి. 1-7 ఈ వారం మొదట్లో ప్రేమ వ్యవహారాలలో అదృష్టం వరిస్తుంది. జీవిత భాగస్వామి చాలా సానుకూలంగా ఉంటారు. కానీ, కొన్ని అలవాట్ల వల్ల ఇబ్బందులు వస్తాయి. అవివాహితులకు సరైన జోడి దొరుకుతుంది. వారం మధ్యలో పనులు ఆగిపోతాయి. మనస్సుకు కష్టంగా వుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు మొదలుపెట్టవద్దు. 8-15 ఈ వారం, కష్టం సుఖం రెండూ వుంటాయి. సన్నిహితుల వల్ల మనస్సుకు కష్టం కలుగుతుంది. క్రోధావేశాలు అదుపులో పెట్టుకోవాలి. ఉద్యోగంలో కొన్ని విషయాలలో చాలా తేలికగానే మంచి ఫలితాలు వస్తాయి. కానీ కొన్ని ప్రణాళికలు, కార్యభారం వల్ల ముందుకు సాగవు. 15-21 వాహన సౌఖ్యం వుంది. దూరపు ప్రదేశాలకు తీర్థయాత్రలు చేస్తారు. సంతానం వల్ల ఆనందం లభిస్తుంది. కుటుంబ వాతావరణం అంత సుఖంగా వుండదు. పని చేసేచోట వ్యర్థ ప్రసంగాలకు తావివ్వకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభానికి అనుకూల సమయం. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. 22-30 ఈ వారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. శ్రమకు తగిన ఫలితం పూర్తిగా అందుకుంటారు. ప్రజలలోను, వ్యాపార ప్రపంచంలోను మీ ప్రతిష్ట పెరుగుతుంది. కానీ మానసిక చికాకులు ఇబ్బంది పెడ్తాయి. గంగనీటితో స్నానం చేయండి.
శు.ది : 3,4,7,8,9,25,26,30 అశు. ది: 1,10,11,18,19,27,28,29.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఈ సమయం ప్రేమ వ్యవహారాలకు బాగా అనుకూలం. ప్రేమపక్షులు వివాహంతో ఏకమయేందుకు అనుకూలమైన సమయం. కానీ, ప్రేమికులు సరిగా తన ప్రవర్తనను వుంచుకోవాలి. వ్యక్తిగత జీవితంలోను, ఉద్యోగంలోను మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో మార్పును కోరుకుంటారు. వ్యతిరేఖులు మిమ్మల్ని ఏమీ చేయలేక ఉండిపోతారు. 1-7 ఈ వారం ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా సాగుతాయి. ఏదో కారణం వల్ల ఇంటికి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. సహోద్యోగులతో అనుబంధం బావుంటుంది. జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. దానివల్ల వైవాహిక జీవితం మరింత బావుంటుంది. 8-14 ఈ వారంలో పనిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. దానికి తగ్గ ఆదాయం లభించక అసంతృప్తిగా వుంటుంది. ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు ఖర్చు పెడతారు. విరోధుల వల్ల చికాకులు పెరుగుతాయి. చేసే పనిలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ ప్రస్తావన తేవటానికి సమయం అనుకూలం. 15-21 ఈ వారంలో ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబం సహకరిస్తుంది. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవటానికై ఆసక్తి చూపిస్తారు. ఆకస్మిక దుర్ఘటన ఎదురుకావచ్చు. వారం మధ్యలో, బంధువుల ఇంటికి వెళ్ళాలనుకుంటారు. స్థిరాస్థులు పెరుగుతాయి. 22-30 చాలా మంచి సమయం, కొత్త పనులు ప్రారంభిస్తారు. వారం మధ్యలో ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంటాయి. ఆరోగ్య పరంగా డబ్బు ఖర్చు పెరుగుతుంది. పనులలో తొందరపాటు వద్దు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని పనులు చేయటం ఉత్తమం. హనుమంతుని ఆరాధించండి. శు.ది : 1,2,16,17,28,29 అశు. ది: 3,4,12,13,20,21,22,30.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఈ మాసం కొంత అనుకూలం. కొంత ప్రతికూలం. ఆదాయం విషయంలో ఏదైనా భయాలు వుంటే వాటిని వెంటనే దూరం చేయాల్సిన అవసరం ఉంది. నెల మొదటి నుంచే ఆదాయంలో తేడాలు కంటికి కనిపించటం మొదలవుతాయి. మనస్సు కష్టపెట్టుకోకుండా ధైర్యంగా వుండాలి. కుటుంబ విషయంలో కూడా హెచ్చుతగ్గులుంటాయి. వృత్తిపరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 1-7 ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆదాయం నిదానంగా వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. పెద్ద పని ఒకటి చేయటానికి గొప్ప వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అయినా సరే, ఆ పని ఆశించినంత ముందుకు సాగదు. కరెంటు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు కష్టమైన లక్ష్యాలను అందుకోగలుగుతారు. 8-14 ఈ వారం దాదాపు శుభంగానే గడుస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాల వేటను తీవ్రతరం చేయాలి. తెలిసిన వారి ద్వారా ప్రయత్నించండి. ఫలితం వుంటుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్ వస్తుంది. కానీ, ప్రత్యర్థులు చికాకు పెడతారు. కుటుంబ వ్యవహారాలు కొంత సుఖంగా, కొంత ఇబ్బందిగా వుంటాయి. 15-21 ఈ వారం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యానికి చేరువవుతున్నకొద్దీ మీలోని భయాలు కూడా పెరుగుతూ పోతాయి. ముఖ్యమైన పనులు మీ చేతికి అందుతాయి. ఇతరుల సహాయం తీసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. డబ్బు ఖర్చుపెట్టి ఇంట్లో కొన్ని మార్పులు చేస్తారు. ఆలోచనలు తగ్గించుకోవాలి. 22-30 ఈ వారం మీ విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదు. మొదట్లో ఒకటి, రెండు రోజులు అటు ఇటు పరుగెత్తాల్సి వస్తుంది. చికాకుగా వుంటుంది. వారం మధ్య నుంచి అదృష్టం బావుంటుంది. డబ్బు చేతికందుతుంది. వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గణపతి, దత్తాత్రేయ పూజ చేసుకోండి.
శుభదినాలు: 2,3,4,8,9,12,13,30 అశుభదినాలు: 5,6,14,15,22,23,24.
Review రాశి ఫలాలు.