రాశి ఫలాలు

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వివాహాది శుభకార్యములు నిశ్చయమవుతాయి. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా, కొంత ఉత్సాహంగా ఉంటుంది. సంతానాభివృద్ధికై చేసిన వ్యయము సత్ఫలితమును ఇవ్వగలదు. ఆకస్మిక ధనలాభమునకు అవకాశం ఉన్నది. విదేవీ ప్రయాణమునకు చేయి ప్రయత్నములు ఫలించును..
వృషభం : కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
అన్ని రంగాలలోని వారికి కలసి వచ్చును. శుభ కార్యములు జరుగుట, శరీర సౌఖ్యము, మంచి ఆరోగ్యము కలుగును. అవసరమైనప్పుడు సహాయము చేయు స్నేహితులు ఉందురు. విద్యా వ్యాసంగములందు పేరు ప్రతిష్ఠలు కలుగును. మాసాంతమున కొద్దిగా చికాకులు కలుగును. ఆర్థికంగా బాగుండును. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1,2,3 పాదాలు
గ్రహస్థితి అనుకూలముగా ఉన్నది. వివాహాది శుభ కార్యములు నిశ్చయమవుతాయి. క్రయ, విక్రయము లందు లాభములు కలుగును. వైద్యులకు, లాయర్లకు అధికాదాయం కలుగుతుంది. సంతానాభివృద్ధికై చేసిన వ్యయము సత్ఫలితమును ఇవ్వగలదు. ఆకస్మిక ధనలాభమునకు అవకాశం ఉన్నది. విదేశీ ప్రయాణమునకు చేయు ప్రయత్నములు ఫలించు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
స్థిర చరాస్థి విషయాలలో ఒక నిర్ణయానికి రాలేరు. సంతానాభివృద్ధి కలుగుతుంది. జర్నలిజం చేసేవారికి మరియు ఉన్నత విద్య చేసే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఉంటుంది. అయినవారి నుండి ముఖ్య సమాచారం రావచ్చును. పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదాలు
ప్రథమార్థంలో గృహమందు శుభకార్యములు జరుగును. పెద్దల మన్ననలు, అధికారుల నుండి ప్రశంసలు, తలవని కార్యములు నెరవేర్చుట, బంధువుల కలయిక కలుగును. ద్వితీయార్థం నుండి గ్రహస్థితి సామాన్యంగా ఉన్నది. ఉద్యోగాన్ని మార్చుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయటం మంచిది. ఆస్తి వ్యవహారాలలో మౌనం వహించుట మంచిది.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ప్రథామార్థంలో గృహ స్థిరాస్తి విషయాలలో శ్రద్ధ వహిస్తారు. వ్యాపారమందు సంతృప్తి కలుగును. కుటుంబ సౌఖ్యం పెరుగును. అప్పుల బాధ తగ్గుతుంది. ద్వితీయార్థం నుండి అనుకున్న పనులు అనుకున్నట్లు సాగవు. క్రయ వియ్రాలలో మీ అంచనాలు తారుమారై ఆశాభంగం కలుగుతుంది. కొంత జాగ్రత్త వహించుట మంచిది.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
మీ శ్రమకు తగిన ఫలితాలు, గుర్తింపు లభిస్తాయి. నూతన పథకాలకు, నూతన ఆలోచనలకు ఈ మాసం అనుకూలం. ఆరోగ్యము, వైద్య సలహాలపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు ఒక వార్త ఎంతో సంతోషాన్ని కలగిస్తుంది. నిర్మాణ పథకాలు ముందుకు సాగుతాయి. మీ అభివృద్ధికి మీ తోటివారి సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
ఈ మాసము శుభాశుభ మిశ్రమము. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. యోగ, ధ్యాన, ఆరాధనలు, ఏకాగ్రతచర్చలు, దర్యాప్తు విచారణలు, విందులు, వినోదాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్థులకు నష్టములు మొదలగునవి జరుగును. ద్వితీయార్థములో కాంట్రాక్టు పనుల వలన లాభములు కలుగును. వైద్యరంగంలోని వారికి కలిసివచ్చును. వ్యవహారిక వ్యాజ్యములందు జయం కలుగును.
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదలు
మాసారంభమున వివాహాది శుభకార్యములు నెరవేరుట, వాహన సౌఖ్యం కలుగును. సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభించును. మీ పనితీరులో ఆకస్మికమైన వింత మార్పు జరిగే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. మాసాంతమున మానసిక ఆందోళనలు, ధననష్టం, శారీరిక ఇబ్బందులు కలుగును.
మకరం: ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ1,2 పాదాలు
అనేక రకాలుగా చికాకులు ఎదురవుతాయి. కోర్టుల వ్యవహారాలలో వాయిదాలు కోరటం మంచిది. వ్యవసాయ దారులకు సమయానికి ధనం అందుతుంది. బంగారపు వ్యాపారస్థులకు మేలైన ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జల సంబంధ వృత్తుల వారికి ఇది అనుకూలమైన కాలం.
కుంభరాశి:ధనిష్ట 3,4 పాదాలు,శతభిషం,పూర్వాభాద్ర1,2,3 పాదాలు
పాత బకాయిలు వసూళ్ళు అవుతాయి. కొత్త పరిచయాలకు ఈ మాసం అనుకూలం, దైవ సందర్శనము, మిత్రుల సహకారం, దానధర్మములు చేయుట, భార్యాభర్తల మధ్య అవగాహన, కీర్తి ప్రతిష్ఠలు కలుగును. మీ సమర్థత లకు గుర్తింపు లభిస్తుంది.శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తాయి. వైద్యులకు, లాయర్లకు పదోన్నతి, గౌరవము కలుగును.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి
శుభవార్త రావచ్చు. మీ సమర్థలకు గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందగలరు. ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించవలెను. నూతన ప్రయాణము లకు అవకాశములు కలుగును. ద్వితీయార్థంలో వృత్తి బాధ్యతలకు, కుటుంబ ఆశక్తుల పొంతన కుదరదు. ఆర్థికమైన ఒత్తిళ్ళకు లోనవుతారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందుకు సాగవలెను.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top