మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
ధనలాభము, తన కులాచారము తప్పక పాటించుట, ఇంటియందు నిత్యోత్సాహము, మంగళకరమగు పనులు, సమస్తమైన దోషములు పోయి సకల ఐశ్వర్యములు పొందుట. గత కొద్ది సంవత్సరములుగా అపరిష్క•తంగా నిలిచిన పనులన్నీ సత్ఫలితాలనిస్తాయి.
వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
నూతన వస్త్రాభరణాదులు కొనుగోలు చేయుదురు. శుభ కార్యక్రమముల యందు పాల్గొంటారు. బంధుమిత్ర సమ్మేళనము, విందు వినోదముల యందు పాల్గొనుట ద్వారా ధన వ్యయము చేయుదురు. నూతనోత్సాహముతో ఉండుట వలన ఆరోగ్యము అనుకూలముగా ఉండును.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, అర్థ్రపునర్వసు 1,2,3 పాదాలు
కుటుంబసభ్యుల ఆరోగ్యం కొంత మెరుగవుతుంది. అయితే అష్టమ రాశిలో రవి సంచారం అంత మంచిది కాదు. ఈ మాసం ప్రయాణములు, అలసట, శతృ బాధలు అధికంగా ఉండును. కావున తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. మనస్థాపం కలిగించే మాటలు వింటారు. మాసం ఉత్తరార్ధంలో అన్నీ కలిసి వస్తాయి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లే
శరీర సౌఖ్యము తగ్గుట, బంధువులకు సంతోషము. ఇల్లు కట్టించుట, ధన ధాన్యములు వృద్ధి, రక్తపోటు, పెద్దలను గౌరవించి, ఆదరించి సౌఖ్యము కలిగించుట, వ్యవసాయ పెట్టుబడులకు ధనము ఖర్చు, ధనధాన్య వృద్ధి పొందుట, బంధువుకు సంతోషము కలిగించుట. సూర్య భగవానుని ఆరాధనచే హృదయ సంబంధ ఆరోగ్యం.
సింహం: ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదాలు
ఈ రాశివారు ఈ మాసం శరీర సౌఖ్యము పొందెదరు. తలపెట్టిన కార్యములు నెరవేర్చదరు. మంచి సుఖము కలుగును. గృహమున వస్త్రాభరణాదుల కొరకు ధనము వెచ్చించెదరు. ద్రవ్యలాభము, ధాన్యాదుల అమ్మకము వలన లాభము కలుగును.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
ఈ మాసం ఈ రాశివారు శుభకార్యములకు హాజరవుతారు. బంధుమిత్రలతో ఆనందముగా గడుపుదురు. ప్రయాణల వలన కొంత బడలిక కలుగును. గృహమున మిశ్రమ ఫలితములు ఉండను. విద్యార్థులు ప్రణాళికలతో ముందుకు సాగగలరు. వ్యాపారస్తులకు తమ వ్యాపారములలో అనుకూలముగా ఉండును.
తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఈ మూసం ధనాదాయానికి లోటుండదు. అయితే కుటుంబ వాతావరణం అంతగా బాగుండదు. భార్యా మూలక అనారోగ్యము, పాదములకు సంబంధించిన చికిత్సలకు వైద్యులను సంప్రదిస్తారు. అనేక రకాల వృత్తులను సమర్థవంతముగా నిర్వహించగలరు. ఆకస్మిక ధన లాభము. భూముల మీద, షేర్ల మీద పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, శ్యేష
ఈ మాసం అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండును. ఇంటి గౌరవం గురించి కృషి చేస్తారు. సాంకేతిక, ఇంజనీరింగ్ విద్యలలో పిల్లలు అభివృద్ధి సాధిస్తారు. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. దైవారాధన చాలా మంచిది.
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదలు
ఈ మాసం రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థికంగా ఈ మాసం ఏ లోటు ఉండదు. సమయానికి చేతినిండా ధనము చేకూరుతుంది. వృత్తి వ్యాపారములలో చిక్కులు, ఇబ్బందులు అధిగమించగలరు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యవసాయము లాభదాయకంగా ఉంటుంది.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
ఇతరులచే చాకచక్యముగా పని చేయించగలరు. కార్య భారాన్ని మోయగలరు. వ్యవహార ప్రతిబంధకములు. ఈ మాసం ధన వ్యయము అధికంగా ఉండును. ఒత్తిడిని అధిగమించి చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపారం కలసి వస్తుంది.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఈ మాసం ఈ రాశివారికి• వ్యవసాయ రీత్యా ఆదాయం సమకూరును. తగిన ధనవ్యయం చేస్తారు. అష్టమ స్థానంలో గురుడు వక్రించుట వల్ల దోష పరిహారార్ధం గురువారం శనగలు దానం చేయుట మంచిది. ఆరోగ్యం కుదుటపడును. కుటుంబ సభ్యుల ఆడంబరములకై ధన వ్యయము చేస్తారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఇంటియందు ఎల్లప్పుడూ ఉత్సాహము, పెండ్లి మొదలగు శభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశి యందు ఉచ్చస్థుడగు శుక్రుడు ఎల్లప్పుడూ ఆనందము, నూతన వస్తు వస్త్రాభరణములు ధరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును.
Review రాశి ఫలాలు.