రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
గత 3 సం।।ల కాలం నుండి ఉన్న వ్యవహార ప్రతి బంధకములు తొలగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు. ఆర్థిక పరిస్థితి మెరుగవును. ముఖ్యులతో పరిచయాలు. వృత్తి నిర్వహణ బాగుంటుంది. శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదం
ధనలాభము, ఆర్థిక పరిపుష్టి, నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కలసి వస్తుంది. ప్రారంభంలో చికాకులు ఏర్పడినా జయించుకుని రాగలరు. ప్రథమార్థంలో ధనలాభం ద్వితీయార్థంలో దానం ఖర్చు సూచనలు కలుగును.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
ధనలాభము, ప్రతిభకు తగ్గ గుర్తింపు, సర్వ కార్యజయము. గృహ సంబంధ నిర్మాణ అమలు జరుపు ప్రయత్నం చేస్తారు. సప్తమ కేంద్రం ధనూరాశిలో శని సంచారం మోకాళ్ళు కీళ్ళ నొప్పుల బారిన పడు అవకాశం, ఆరోగ్య శ్రద్ధ అవసరం.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేషా
మాతృసౌఖ్యము, ధనధాన్య వృద్ధి, స్వబుద్ధిచే కార్యముల యందు జయము. కుటుంబంలో
శుభకార్య నిర్వహణ, శుభపరంపరలు, బంధుమిత్రా నందం. గుర్తింపు. ఆరోగ్యం, అదృష్ట కలిసి వస్తుంది. విద్యార్థులకు విదేశీయాన అనుకూలం.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అధికారం వృద్ధి ఆకస్మిక ధనలాభము. వ్యాపార వ్యవహారాలు అనుకూలం. లక్ష్యం వైపుకు దూసుకు పోతారు. లక్ష్యసాధన, మత్తు పదార్థ భక్షణ, ఊపిరితిత్తులకు సంబంధ అనారోగ్యం, సోమరితనము తన పొరపాట్ల వలన కీర్తి తగ్గుట జరుగును.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
క్రిందివారిపై ద్వేషము, భార్యకు అనారోగ్యము, శరీర ఆరోగ్యం జాగ్రత్త, ఋణములు, జూదము, దేశ దిమ్మరితనము, అనారోగ్యము, చెడుసావాసములు, అష్టమ కుజ దోషనివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. పుణ్యక్షేత్ర సందర్శన.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఉన్నత విద్యలకై విదేశీయాన ప్రయత్నం సఫలం. కళత్ర ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. నెల ప్రారంభములో కలత, మనశాంతి లోపించుట జరుగును. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరము.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జేష్ఠ
చేతి వృత్తి వ్యాపారములు అనుకూలమగును. ధనసౌఖ్యము కలుగును. దూరపు బంధువుల సంబంధించి దుర్వార్తా శ్రవణము, ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. రాజకీయంగా ఎదుగుదల, పదవులు మిమ్ములను
వరిస్తాయి.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
స్వస్థాన ప్రాప్తి, ధనలాభము, కీర్తి, సంతోషము, ఆరోగ్యము, స్త్రీ పురుషుల మధ్య సంభాషణలు, తీర్థయాత్రఫలము. దేవతానుగ్రహ ప్రాప్తి, సమయానుకూలంగా పనులు చేసి సాధించుట, భార్యాభర్త మధ్య అన్యోన్యతలు, అన్నింటా జయము.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
శరీరమున అనారోగ్యము తొలగును. బంధుమిత్రులతో సుఖ సంతోషములు, ధన ద్రవ్యలాభములు. ఇష్ట కామ్యసిద్ధి గృహమున ఆనందోత్సాహాలు, సంతానము అభివృద్ధిలోనికి వచ్చుట వలన ఆనందము కలుగును.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ప్రారంభంలో ఆరోగ్యమునకై యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు, వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు, ప్రతిఫలం. దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు. సోదరులకు కలసి వస్తుంది. వారి ఉన్నతికి పాటుపడతారు.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతీ
మాతృవర్గము వారితో కలియుట, శ్రమ వలన అలసట, మనోధైర్యము, యత్నకార్యసిద్ధి, భారీగా వస్తు వస్త్రాదుల కొనుగోలు, ఇంట పండుగ వాతావరణము, మృష్టాన్న భోజనము, సంతృప్తి చేయు వృత్తులు ఆశాజనకముగా యుండును.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top