మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాద
తెలివిగా చరుగ్గా చలాకీతనాన్ని ప్రదర్శిస్తారు. భోగం అనుభవిస్తారు. శుభ కార్యాచరణ, సంతోషము. ధైర్యంగా ముందుచూపుతో నడచి రాజకీయ లబ్ధి. నూతన పదవులు ఆకర్షిస్తాయి. మీ సలహాలు ఇతరులకు మేలు, మార్గదర్శకాలు.
వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదా
వృత్తి, వ్యాపారాల్లో మార్పుల సూచన. నూతన వ్యాపారాలను నిర్వహించే అవకాశం. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జాయింటు వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యము. ఆరోగ్యము సామాన్యము.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదా
ఇంట్లో శుభకార్య సందడి, సమయానికి ధనం చేతికందుట, అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేర్చడం, పుణ్యకార్యాచర•ణ, ఇష్టకార్యసిద్ధి, తేజస్సు. భోగ భాగ్యములు, అర్ధలాభం, క్షీరాన్నభోజనం, సంతృప్తి. బంధువులకు అక్కడక్కడ చిక్కులు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేషా
విజ్ఞానం సముపార్జన చేయగల్గుతారు. అన్నింటా మీదే పైచేయి. సభాగౌరవం దక్కుతుంది. నిత్యనూతనంగా యుంటారు. నూతన కార్యక్రమ నిర్వహణచే అందరి మన్ననలు, ప్రశంసలు, దైవబలం పెరుగను. ధనధాన్య లాభము, సర్వకార్య జయం.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాద
రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని వాటిని జయప్రదం గావిస్తారు. అందరిచే కీర్తించబడతారు. జ్ఞాన సముపార్జన. ఋణ విమోచన. న్యాయపరమైన అంశంలో ఇతరులకు సూచన చేస్తారు. పెద్ద మొత్తంలో భూమి కొనుగోలు అవకాశములు.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదా
విద్యాభివృద్ధి, విదేశీ ప్రయాణాలు, పని వత్తిడి, మెడ నరముల నొప్పులు, అల్సర్లు, ఉదర సంబంధ అజీర్ణము, ధనం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వ మిత్రుల బాంధవ్యాలు మెరుగు. చిన్నకారు, వస్త్ర వర్తకులకు, టైలర్లకు ధనలాభం.
తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదా
కార్యములను ధైర్యముగా సాధించగలరు. వృత్తి వ్యాపారముల యందు అనుకూలము. ఆకస్మిక ధనలాభములు కలుగును. ఆరోగ్యము అంతంత మాత్రమే. రక్తపోటు హెచ్చు తగ్గులు, మధుమేహం ఉన్న వారు జాగ్రత్త పడుట మంచిది.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
ధనధాన్యాదుల వృద్ధి, బంధు మిత్రుల ఆదరణ, పదిమందిలో మంచి పేరుప్రతిష్ఠలు. సభలలో వాగ్ధాటి ప్రదర్శించి అందరిని జయించుకుని రాగలరు. విద్యలచే వినోదపడి సుఖించుట, వస్త్ర, ధన, ధాన్య లాభములు, మనోధైర్యము.
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాద
యత్నకార్య సిద్ధి, శరీరం సుఖముగా నుండుట, ధనధాన్య వస్త్రాది లాభములు, విశేష వస్తు సంగ్రహణ, అందరికి ఆనందము, సుఖ సంతోషములతో వర్ధిల్లుట సత్ప్రవర్తన పెద్దలను గౌరవించుట మొదలగు మంచి లక్షణము లుండును.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదా
ప్రారంభంలో ధనధాన్య లాభములు, వస్తు, వస్త్ర సంపదల వృద్ధి, గృహాలంకరణ, సర్వసౌఖ్యములు, శయ్యా భోగము, ఆనందము, ఆహ్లాదముల కలుగును. నెలాఖరులో దూర ప్రాంత ప్రయాణములు, దేవతా సందర్శనములు కలసి వచ్చును.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదా
వన విహారాలు, ప్రకృతిరమణీయ ప్రదేశములను వీక్షిస్తారు. దూరపు బంధువులకు దగ్గరవుతారు. ధనలాభం, తగ్గ ఖర్చు, ఆర్థిక పుష్టి, స్వ ఆలోచనతో చేసి కార్యములు సఫలం. అకాల భోజనం, నిద్రలేమి వల్ల అలసత్వం.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వన విహారములు చేయుట, దూర ప్రాంతాలను దర్శించుట, జలక్రీడలలో పాల్గొనుట, శరీరారోగ్యము హుషారుగా యుండుట, విద్యా వ్యాసంగములలో పాల్గొనుట, తన ఉద్యోగ విషయములలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు.
Review రాశి ఫలాలు.