మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాద
ఉత్సాహముగా, ఉల్లాసంగా ఉంటారు. ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది. ధనధాన వివర్ధానము, పుత్ర, పౌత్ర ప్రవర్ధనం, గృహమున శుభములు. ఇష్టకార్యసిద్ధి. ధన, వస్త్ర, భూషణ, ఆరోగ్య లాభములు. మాతృసౌఖ్యం. వాహన ప్రాప్తి.
వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదా
వృత్తి, వ్యాపారాల్లో మార్పుల సూచన. నూతన వ్యాపారాలను నిర్వహించే అవకాశం. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జాయింటు వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యము. ఆరోగ్యము సామాన్యము.
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదా
గృహనిర్మాణము పూర్తి చేస్తారు. నాణ్యమైన గృహోపయోగ వస్తువులను కొనుట. గృహమున శుభ, పుణ్య కార్యాచరణలు, ఆధిపత్యము కోసం తాపత్రయ పడతారు. ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. అధికారిక హోదా పెరుగుతుంది.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసంలో ఖర్చు అధికం. ఇంటికి సంబంధించి మార్పులు చేస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శయ్యాభోగం అనుభవిస్తారు. లలిత కళల్లో రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యం. మిశ్రమ ఫలితాలు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాద
మీ కార్చాతుర్యం, విషయ విశ్లేషణ అందరినీ ఆకట్టు కుంటాయి. ఆదాయ మార్గాలు మెరుగు, ధనలాభం. వృత్తి వ్యాపారాలు బాగా కలసివస్తాయి. వ్యాపారంలో పెట్టుబడికి తగ్గ ఆదాయం. నాణ్యమైన ఉత్పత్తులను పెంపొందించే కృషి ఫలిస్తుంది.
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదా
స్వయంకృషితో వృత్తి వ్యాపార వాణిజ్యాలలో రాణిస్తారు. భాగస్వామ్యం వద్దు. విదేశీ ప్రయాణాలు అనుకూలం. రాజకీయమైన అంశాలలో సమయస్ఫూర్తి, నేర్పు. మీ సలహాలు, సూచనలు అందరికి నచ్చుతాయి. నాయకత్వం లక్షణాలు. సర్వజయం.
తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదా
నెలా•రుకు శుభవార్తలు వినుట, కళ్యాణాది శుభకార్యములలో పాల్గొనుట, బంధు మిత్రులతో ఆనందముగా నుండు యోగము కలదు. సంతానము గురించి ఆందోళన, దిగులు ఉండును. కార్యక్రమములను సక్రమముగా నిర్వర్తించగలరు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
తాపము, కోపము, గొప్ప భయము, ఎల్లప్పుడు సుఖించాలనే తపన, స్త్రీల వలన మనస్తాపము, చెడు పనుల వలన కలుగు దోషయు, రాకపోకల చేత కలుగును బాధ, మనస్సుకు నచ్చని మాటలు వినుట మొదలగు ఫలములు కలుగును.
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాద
తనను గోరినవి తక్షణమే లభించుట, దేహమందారోగ్యము, శరీరసౌష్టవము, బంధువులతో సంతోషపడును. మధుర పదార్థములను భుజించుట ఎల్లప్పుడూ ఆనందము, కోరిన స్థానచలనములు, పై అధికారుల ఆదరణ, అండదండలు.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదా
విద్యావినోదము, సభలలో వాగ్ధాటిచే, అందరిని మెప్పించుట, ధన లాభములు ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశములు దేహరోగ్యము యత్నకార్యసిద్ధి, సుఖప్రాప్తి, తోటివారికీ ఉపకారము చేయుట సత్సంగము కలుగును.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదా
గృహశోభాలంకరణ, వక్త•త్వపు పోటీలందు ప్రతిభ వల్ల బహుమతులు. మీ విద్యాభివృద్ధికి ఈ మాసం పునాదులు వేస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రముఖులను కలసి వారితో కలసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
విద్యా విషయంలో ముందంజ, విదేశీయానం, దూర ప్రయాణములు కలసి వచ్చుట, దైవబలముతో కార్యనిర్వహణ, ఓర్పు, క్రమశిక్షణతో కార్య జయం. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గములు పెరిగి ధనాగమనము.
Review రాశి ఫలాలు.