దుర్గాదేవి పసుపు వర్ణంతో ప్రకాశిస్తుంది.
కాళికాదేవి ముదురు నీలం రంగులో ఉంటుంది.
సరస్వతీదేవి తెల్లని దవళ వర్ణంతో స్వచ్ఛమైన ముత్యపు రంగులో ప్రకాశిస్తుంది.
ఇలా ఒక్కో దేవతను స్మరించుకోగానే ఒక్కో రంగు మన మనసులో తళుకున్న మెరుస్తుంది. దేవుడు లేదా దేవతను ఆ రంగులోనే మనం భావన చేస్తాం. మరో రంగులో ఆ దేవతను పోల్చుకోలేం.
ఆకాశం రంగు నీలం. ఆకాశానికి విశ్వమంతటా వ్యాపించి ఉండే లక్షణం ఉంది. దూరం నుంచి చూస్తే సముద్రం కూడా నీలం రంగులో కనిపిస్తుంది. సముద్రం అనంతం అనే భావనకు ప్రతీక.
ఇలా సర్వవ్యాపక లక్షణాలు కలిగిన నీలపు రంగులోనే రాముడు ఉన్నాడు. రామకృష్ణులు ఇద్దరూ మహావిష్ణువు యొక్క అవతారాలు. వారిద్దరిలోని సర్వవ్యాపకత్వాన్ని నీలం రంగు వ్యక్తం చేస్తుంది. ఇలాగే దేవతలందరూ కూడా తమ తమ వర్ణాల ద్వారా తమ స్వరూప స్వభావాలను వ్యక్తీకరిస్తుంటారు.
ఇలా ఒక్కో దేవతకు ఒక్కో రంగు సంబంధించి ఉంటుంది. ఈ రంగులన్నీ ఆయా దేవతల స్వభావాన్ని ప్రకటిస్తాయి. జగన్మాత స్వరూపాలు కూడా అంతే. ఒక్కో అమ్మవారు ఒక్కో రంగు కలిగి ఉంటారు.
అన్నపూర్ణాదేవి ఎరుపు
లక్ష్మీదేవి బంగారు
సరస్వతి తెలుపు
కాళి ముదురు నీలం
దుర్గాదేవి పసుపు
మహిషాసురమర్ధని ఎరుపు
రాజరాజేశ్వరీదేవి పసుపు
బగళాముఖి బంగారు
శాకంబరి మిశ్రమ వర్ణం
ఒక్కో రంగుకు ఒక్కో లక్ష్యం, అవసరం, ప్రత్యేకత ఉన్నాయి. మానసిక ఔన్నత్యం, ఆధ్యాత్మిక శక్తులకు రంగులు ప్రతీకలుగా నిలుస్తాయని కిర్లియన్ ఫొటోగ్రఫీ నిరూపించింది. దీంతో ఫొటోలు తీసినపుడు మనిషి చుట్టూ వైవిధ్యమైన రంగులతో కాంతి పరివేషం కనిపిస్తుంది. ఇది కోపంగా ఉన్నపుడు ఒక రకం, శాంతంగా ఉన్నపుడు మరో రకం, ఆందోళనగా ఉన్నపుడు ఇంకో రకంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం భగవాన్ సత్యసాయిబాబాను ఈ విధానంలో ఫొటో తీసినపుడు ఆయన చుట్టూ అద్భుతమైన నీలికాంతులను గమనించానని ఓ శాస్త్రవేత్త చెప్పారు. ఏ రంగు మన ఆధ్యాత్మికతకు, మన ఉన్నతికి, మన మనస్తత్వానికి దోహదపడుతుందో అర్థం చేసుకోవడమే భగవంతుని స్వప్పలిపిని అధ్యయనం చేయడం. మనిషి తానున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుంది. దీనిని తెలుసుకున్న వాళ్ల జీవితం వర్ణరంజితమవుతుంది. సప్తవర్ణ శోభితమవుతుంది.
Review అమ్మవార్ల రంగూ రూపు.