
హనుమంతుడిని ఎలా పూజించాలి? ఇందుకోసం ఏమైనా ప్రత్యేక పూజా విధానాలు ఉన్నాయా?
పరిపూర్ణమైన భక్తి అనేది ఒక్కటి ఉంటే చాలు.. ఏ దైవాన్నయినా పూజించడానికి. అది లేకుండా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. ఇక దేవీదేవతలను ఎలా పూజించాలో మన పెద్దలు కొన్ని ఆచారాలు ఏర్పరిచారు. నిజానికి భక్తితో నిండిన మనసుతో పూజించడం కన్నా గొప్ప విధానం మరేదీ లేదు. కానీ, కొన్ని పద్ధతులు, విధానాలు కొనసాగాలంటే ఆచారాలను పాటించడం తప్పనిసరి.
ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్నం హనుమంతుడు. అటువంటి హనుమంతు డికి చైత్ర మాసాన అంజనీదేవి జన్మనిచ్చింది. చైత్ర మాసాన వచ్చే హనుమత్ జయంతి నాడు ఆయనను నిష్టగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే, వారాల్లో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతు డిని కొలిచే వారికి అనుకున్న కార్యాలు దిగ్వి జయంగా పూర్తవుతాయి.
హనుమంతుడిని పూజించడానికి విగ్రహం లేదా పటం తీసుకోవాలి. పువ్వులు, పండ్లు, బియ్యం, దీపం, మిఠాయిలు, మట్టికుండ అవ సరం. హనుమజ్జయంతి రోజున గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, ఏదైనా ఆకుపచ్చని కూర గాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి.
హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఒక ప్రదేశంలో ఉంచి అలంకరించాలి. దీపం వెలి గించి పువ్వులు, పండ్లు, బియ్యం సమర్పించి పూజ చేయాలి.
ఇకపోతే, హనుమంతుడికి సిందూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై సిందూరం పెట్టుకునే సంగతిని ఆరా తీయగా, శ్రీరాముడి అనుగ్రహం కోసమని సమాధానమిచ్చిందని, శ్రీరాముడి కోసం హనుమంతుడు శరీరం అంతా సిందూరం అద్దుకున్నాడని చెబుతారు.
భక్తులు బ్రాహ్మణులకు సిందూరం దానం చేసే ఆచారం కూడా ఉంది. హనుమంతుడిని పూజించే టపుడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పారా యణం చేయడం మంచిది.
హనుమజ్జయంతి రోజున అప్పాలను నైవే ద్యంగా పెట్టాలని అంటారు.
ఆదివారం ఆచరించకూడని నిషిద్ధ కర్మలేమైనా ఉన్నాయా?
మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం, తలకు నూనె పెట్టుకోవడం.. ఇవి ఆదివారం నిషేధించిన కర్మలు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో, పురాణేతిహాసాల్లో ఏ రోజుకీ ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. హైందవ ధర్మంలో సూర్యోపాసన ముఖ్యమైనది. మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌర మానం ప్రకారం, అంటే సూర్యుని ఆధారంగానే నిర్ణయించబడ్డాయి. ప్రాతఃకాలాన్నే నిద్రలేచి సూర్యనమస్కారాలు చేయడం, సంధ్య వేళ సంధ్యా వందనాలు ఆచరించడం వంటివి సూర్యుడిని ఆరాధించే పద్ధతుల్లో ముఖ్యమైనవి.
ఇలాంటి ఆదివారాలు మనకు చాలా ముఖ్య మైనవి. పవిత్రమైనవి. కాబట్టే మన పూర్వీకులు పరమ పవిత్రంగా భావించే వారు. ఆ రోజు జీవ హింస చేసి మాంసాన్ని తినేవారు కాదు. మద్యాన్ని తాగే వారు కాదు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అటువంటి ఆదివారం నాడే మద్యం తాగడం, మాంసం తినడం, వీకెండ్స్ పేరుతో తందనాలు ఆడటం అనే సంస్క•తి పుట్టుకొచ్చింది.
మనసులో కలిగే ఈర్ష్యను ఎలా దూరం చేసుకోవాలి?
ఈర్ష్యతో సాధించేదేమీ ఉండదు. అది అందరికీ అందరినీ దూరం చేస్తుంది. ఈర్ష్య అందరి ఆప్యాయతలను సైతం దూరం చేస్తుంది. చివరకు మనసును కూడా కాలిపోయిన చెట్టు వలే మసి చేస్తుంది. ఈర్ష్య ఆవరించిన చెట్టు నుంచి సంతోషం అనే పుష్పాలు, ఆనందం అనే ఫలాలు రాలిపోతాయి. కనుక ఈర్ష్యతో రగిలి పోయే వారు కాస్తంత దయా గుణాన్ని అలవర్చు కోవడం అవసరం. ఎదుటి వారి అదృష్టాన్ని తల్చుకుని చింతించడం, వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక పోవడం, అవతలి వారితో పోల్చుకుని వారి నాశ నాన్ని కోరుకోవడం.. ఇటువంటి లక్షణాలన్నీ ఈర్ష్య కిందకే వస్తాయి. సమభావం, దయాగుణం అనేవి ఇటువంటి మంచి లక్షణాలు చెడును మన నుంచి దూరంగా ఉంచుతుంది
Review ఆదివారం ఏo చేయకూడదు.