గరుత్మంతుడు

సృష్టిలో ప్రతి జీవికి స్వేచ్ఛను అనుభవించే హక్కును భగవంతుడు ప్రసాదించాడు. తమకు, తమ వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం కలిగినపుడు దానిని పరిరక్షించుకోవడం ధీరుల లక్షణం. మన పురాణాల్లోని గరుత్మంతుడు కూడా తనకు తన తల్లికి స్వేచ్ఛ కావాలని పోరాడి గెలిచిన ధైర్యవంతుడు.
కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య వినత కొడుకు గరుత్మంతుడు. తండ్రి తపశ్శక్తి కారణంగా పుట్టుకతోనే మహా బలవంతుడు.
ఇక కద్రువకు పాములే సంతానం. సహజ వైరులైన సర్పాలు, గరుడిని మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుండేది. సాధారణంగా బలశాలియైన గరుడునిదే ఈ యుద్ధంలో పైచేయిగా ఉండేది. తన కుమారుల శక్తిహీనతకు, ఓటమికి కద్రువ కోపంతో మండిపోతూ వినతపై ద్వేషం పెంచుకుంది. వినత ద్వారా గరుడిని పొగరు అణచాలని నిరంతరం ఆలోచించేది. ఒకనాటి సాయంత్రం వినత, కద్రువలు వన విహారం చేస్తున్నారు. దూరంగా దేవతల అశ్వం నీరెండలో పచ్చిక మేస్తూ ఉంది. దాని తెల్లని శరీరం నిగనిగమని మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. ఆ గుర్రం తెలుపు వర్ణాన్ని వినత పొగుడుతుంటే కద్రువ దాని తోక నల్లగా ఉందని అంది. కాదని, అవునని ఇద్దరూ వాదించుకున్నారు. ఆ వాదం కాస్తా ముదిరి పందెంలోకి దిగింది. ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాస్యం చెయ్యాలని పందెం వేసుకున్నారు. మరునాటి ఉదయం వినత, కద్రువ ఆ గుర్రం ఉన్నచోటకు చేరుకున్నారు.
అయితే, కద్రువ పథకం ప్రకారం ఆమె బిడ్డలైన నల్లపాములు ఆ గుర్రం తోకను చుట్టుకుని ఆ తోక నల్లనిదే అనే భ్రాంతిని కలిగించాయి. పందెం ప్రకారం వినత కద్రువకు దాసి అయింది. ఏదో సరదాకు వేసిన పందెం కనుక ఒకరోజు అనుకున్నది కాస్తా కద్రువ దురాలోచన వల్ల దాసిత్వం శాశ్వతమైంది. వినతతో పాటు గరుత్మంతుడు కూడా కద్రువకు, ఆమె సంతానానికి దాసులయ్యారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. గరుడిని, అతని తల్లిని కద్రువ, ఆమె పుత్రులు (పాములు) పెట్టే బాధలు ఎక్కువ కాసాగాయి. తమకు స్వేచ్ఛ ల•కిగించాలని గరుడుడు పినతల్లి వినతను కోరాడు. తన పిల్లలకు అమృతం తెచ్చిచ్చే పక్షంలో మీకు స్వేచ్ఛ కల్పిస్తానని వినత షరతు విధించింది. మార్గం దొరికిందని ఆనందించిన గరుడుడు తల్లి ఆశీర్వాదం పొంది స్వర్గానికి ఎగిరాడు. సర్వలోకంలో ప్రవేశించి అమృత కలశాన్ని అందుకుని బయల్దేరబోతుంటే దేవతలు అడ్డుకున్నాడు. తన రెక్కల తాకిడితో గరుడుడు వారందరినీ ఎగరగొట్టాడు. ఆఖరుగా ఇంద్రుడు వజ్రాయుధం చేతబట్టి వచ్చాడు. వజ్రాయుధానికి కూడా చలించని గరుత్మంతుడి పరాక్రమానికి ఆశ్చర్యపడిన ఇంద్రుడు అతడిని అమృతం తాగమన్నాడు. కానీ గరుత్మంతుడు అమృతం తనకు అవసరం లేదనీ, తన తల్లికి దాస్య విముక్తి కలిగించడానికై పినతల్లికి ఇవ్వాలని, కాబట్టి తనకు అమృతభాండాన్ని ప్రసాదించాలని ప్రార్థించాడు. అయితే విషసర్పాలకు, ఈర్ష్యాసూయలు కలిగిన వారికి అమృతపానం అనర్హమంటూ ఇంద్రుడు ఇవ్వడానికి నిరాకరించాడు. వారికి ఇచ్చినట్టే ఇచ్చి, తిరిగి తీసుకుని వచ్చేస్తానని ఒప్పించి, గరుత్మంతుడు అమృత కలశంతో పినతల్లి వద్దకు వచ్చాడు. అతి పవిత్రమైన అమృతాన్ని శుచిగా స్వీకరించాలని, వారిని స్నానం చేసి రమ్మని చెప్పి కద్రువతో తనకు, తన తల్లికి దాస్య విముక్తి కలిగించాలని కోరాడు. అమృతాన్ని చూసిన సంతోషంతో వినత, గరుత్మంతుడికి పంచభూతాల సాక్షిగా దాస్య విముక్తి అయిందని కద్రువ ప్రకటించింది. వెంటనే గరుడుడు అమృత కలశాన్ని దర్బ పొదలపై ఉంచాడు. నాగులు వడివడిగా అమృత కలశానికి దగ్గరకు రాగానే ఒక్క ఉదుటున అమృతాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్లి ఇంద్రుడికి అప్పగించాడు. ఎంతో ఆశతో వచ్చి కద్రువ సంతానం నిరాశతో గరికలపై అమృతం చిందిందేమో అన్న ఆత్రుతతో నాకడం మొదలుపెట్టాయి. పదునైన గరికలు వాటి నాల్కలను చీల్చివేశాయి. తల్లికి, తనకు స్వేచ్ఛను పొందే ప్రయత్నంలో గరుత్మంతుడు చూపిన నేర్పును, సాహసాన్ని మెచ్చుకుని దేవతలు పూలవాన కురిపించి ఆనందించారు. శ్రీమహా విష్ణువు గరుత్మంతుడి ధైర్యసాహసాలకు, బలానికి, వినయ విధేయతలకు మెచ్చి, శాశ్వతంగా తన వాహనంగా చేసుకుని గరుడవాహనుడిగా కీర్తిని పొందాడు.

Review గరుత్మంతుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top