రేంవడు అంటే రజకుడు. ఈ సామెత పుట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది.
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రేవు ఉండేది. చాకలి రోజూ ఆ రేవుకు వచ్చి బట్టలు ఉతుకుతుండే వాడు. ఒకరోజు సగం బట్టలు ఉతికి ఒడ్డున ఆరేస్తుండగా, అకస్మాత్తుగా వాగు పొంగింది.
‘అయ్యో! అయ్యో! నా బట్టలు’’ అంటూ అతడు కొట్టుకుపోతున్న బట్టలను పట్టుకోవడానికి వాగులోకి పరుగెత్తాడు. కానీ, అప్పటికే కొన్ని బట్టలు వాగులోకి కొట్టుకుపోయాయి.
అంతలో వాగు మరింత ఉధృతంగా పొంగింది. అతడు ప్రాణాలు దక్కించుకునేందుకు ఒడ్డున ఉన్న మిగిలిన బట్టలను కూడా వదిలేసి, పరుగెత్తుకుని దగ్గరలోని గుట్ట ఎక్కాడు. వాగు ఉధృతికి మిగిలిన ఆ బట్టలు కూడా కొట్టుకుపోయాయి.
మొదటే ఒడ్డున ఉన్న బట్టలు తీసుకుని గట్టుపైకి ఎక్కి ఉంటే అవన్నీ దక్కేవి కదా!. అలాకాక, వాటిని వదిలేసి కొట్టుకుపోతున్న బట్టల కోసం వెంపర్లాడాడు. ఈలోగా వాగు మరింత పొంగి ఒడ్డున ఉన్న బట్టలూ కొట్టుకుపోయాయి. ఈ విధంగా ఆ అతడు రెంటికీ చెడ్డాడన్న మాట. ఇక్కడ నష్టపోయిన వాడు రేవడు కాబట్టి, అతను పొందిన నష్టానికి అనుగుణంగా ‘రెంటికీ చెడిన రేవడి చందాన’ అనే సామెత పుట్టింది. దీనికి సంబంధించి సంస్కృతంలోనూ ఒక సామెత ఉంది. సంస్కకృతంలో ‘రేవణ’ పేరుతో ఈ సామెత ఉంది. అదే తెలుగులోకి వచ్చేసరికి ‘రేవడి’గా మారిందని అంటారు. పూర్వమీమాంస అనే గ్రంథాన్ని కుమారిల భట్టపాదుడు రచించాడు. ఈయన వద్ద నలుగురు పనిచేసే వారు. అందులో ఉంవేకుడనే వాడికి కారికం అనే విద్య మాత్రమే తెలుసు. ప్రభాకరుడికి తంత్రం మాత్రమే తెలుసు. మండనుడనే వాడికి తంత్రం, కారికం.. ఈ రెండూ తెలుసు. నాలుగో వాడైన రేవణుడికి కారికం, తంత్రం.. ఈ రెండూ తెలియవు. పాపం, ఎన్నాళ్లు గురు శుశ్రూష చేసినా రేవణుడు ఈ రెండు విద్యలను నేర్వలేకపోయాడు. ఎంతకాలం చదివినా అవి తలకెక్కలేదు. దీంతో అతను ఉభయ భ్రష్టుడయ్యాడు. అందుకే ‘రెంటికీ చెడ్డ రేవణ’డనే సామెత పుట్టిందని అంటారు. అది తెలుగులోకి వచ్చేసరికి రేవడిగా మారి ఉంటుందని ఒక అభిప్రాయం. ఈ రేవణుడు అనే వాడు కుమారిల భట్టుడికి శిష్యుడు కానీ, ఆయన రచించిన పూర్వమీమాంస గ్రంథానికి జరిగిన కృషిలో పాలుపంచుకున్న వాడు కానీ అయి ఉంటాడని అంటారు.
ఇక, తెలుగులోని ‘రెంటికీ చెడిన రేవడి’ అనే సామెతకు దాదాపు దగ్గరి సామెత మరొకటి ఉంది. అది` ‘ఉన్నదీ పోయిందీ.. ఉంచుకున్నదీ పోయింది’.
రెంటికీ చెడిన రేవడి

Review రెంటికీ చెడిన రేవడి.