వినదగు నెవ్వరుచెప్పిన.

వినసొంపుగా చెప్పే వారు ఉంటే సరిపోదు.
శ్రద్ధగా వినే వారు ఉండాలి.
సావధానంగా చెవులు రిక్కించి వినే వాళ్లుంటే కుదరదు.
విషయాన్ని ఓపిగ్గా విడమరచి చెప్పే వారు ఉండాలి.
ఇది గురుశిష్యుల ప్రాథమిక లక్షణం.
లోకాస్సమస్తా సుఖినో భవంతు..
గురు శిష్య పరంపర ఈనాటికీ భారతావనిలో అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ముఖ్య కారణం- ‘గురువు చెప్పడం – శిష్యుడు వినడం’ అనే సూత్రం. ఆధ్యాత్మిక జీవన వికాసంలో ప్రస్తావించే శ్రవణం, మననం, నిధి ధ్యానం, సాక్షాత్కారాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. మోక్షం అనే భగవత్‍ సాక్షాత్కారం పొందడానికి శ్రవణమే నాంది అనేది మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం.
శ్రీమద్భాగవతంలో అంతర్గతంగా చెప్పిన నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణానిది మొదటి స్థానమని గుర్తించాలి. శ్రవణం అంటే శ్రద్ధగా వినడం. మనిషి జీవన ప్రయాణంలో సమయానికి నాలుగు మంచి ముక్కలు చెప్పగలిగేవారు దొరకడం పూర్వజన్మ సుకృతం. చెవులకు రెప్పలు లేవు. కాబట్టి సమస్త మాటల ప్రవాహం మనసు లోకి అలవోకగా ప్రవహిస్తుంది. హృద యాన్ని జల్లెడ చేసుకుని మంచిని గ్రహించి, చెడును విసర్జిస్తే లోకాస్సమస్తా సుఖినో భవంతు అనే భావానికి అంకురార్పణ జరుగుతుంది.
ఆనాటి సంప్రదాయమే నేటికీ దారి చూపుతోంది..
వేదాలను రుషులు భగవంతుడి ద్వారా విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అంటారు. ఆనాటి రుషులు అంతటి ఏకాసంధా గ్రాహులు కావడం వల్లే ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా ఆ జ్ఞాన సంపదను మనవరకు అందించగలిగారు. ఈనాటికీ మన హైందవ ధర్మం, సంప్రదాయం కట్టుతప్పకుండా నడుస్తోం దంటే అందుకు కారణం.. ఆనాడే మన రుషులు వేదాల ద్వారా గ్రహించిన మంచి విషయాల ఆధారంగా ఏర్పరిచిన సంప్రదాయ రీతులే.
వినడమంటే తేలిక కాదు!
వినడం అనేది అంత తేలికైన విషయం కాదు. మనసును పరిపరి విధాల ఆలోచనలపైకి జారుకో నివ్వకుండా పట్టుకుని, వినబోయే విషయం మీద పెడితే అప్పుడు ఎదుటివారి మనసులో ఉన్న విషయం మన వశం అవుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలందరికీ ఒక్కసారే విపులంగా పాఠం చెప్పినా, ఒక్కొక్కరూ ఒక్కో రకంగా అర్థం చేసుకుని, వారికి తోచిన విధంగా పరీక్షల్లో రాస్తారు. అందుకే పరీక్షల్లో ఏ ఒక్కరికీ ఒక్క రీతిలో మార్కులు రావు. ఎందుకంటే తాము విన్నది ఒక్కో విద్యార్థి ఒక్కో విధంగా విశ్లేషించుకుని ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తారు.
గురువు ఒక్కరే.. శిష్యులు ఎన్నో రకాలు
గురువులు తమ ధర్మంగా జీవితకాలంలో కొన్ని వందల మందికి ప్రవచనాలు ఇస్తారు. మంచి విషయాలు బోధిస్తారు. అవి విన్న వారం దరికి తలకెక్కుతున్నాయా? అంటే సందేహమే!

Review వినదగు నెవ్వరుచెప్పిన..

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top