
మొదటి నుంచీ విలక్షణ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తాడని వెంకటేష్‌కు పేరు. తెలుగు నాట అగ్ర కథానాయకుడైన ఈయన ఇమేజ్‌కు భిన్నంగా ఏ పాత్రలోనైనా కనిపించడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇటీవలే విడుదలైన ‘గురు’లో గెడ్డంతో, మంచి ఫిజిక్‌తో కనిపించిన వెంకటేష్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. బాక్సింగ్‌లో అమ్మాయిని తీర్చిదిద్దే క్రమంలో ఆమెను మోటివేట్ చేస్తూ బాగా నటించారని అందరూ అంటున్నారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, ఇకపై తరువాత సినిమా నుంచి తనకు కొత్త ప్రయాణం మొదలైందని వెంకటేష్ చెబుతున్నారు. ఇంకేం ప్రయోగాలు చేస్తారో తెరపై చూడాల్సిందే.
Review అదిరింది గురు.