చాలామంది సినిమాలను సినిమాలుగానే తీసుకుంటారు. కానీ, కొందరు వాటినే జీవితంగా భావిస్తారు. ఈ కోవకు చెందిన కథానాయిక అనుష్క. అనుష్క తన కెరీర్‌కు ఎంతో ప్రాణమిస్తుంది. సినిమాలనే జీవితంగా భావిస్తుంది. ఈమె సినిమాల గురించే నిరంతరం మాట్లాడుతుంది. సినిమాలే సర్వస్వం అన్నట్టు ప్రవర్తిస్తుంది. సినిమాలు తప్ప మరో ప్రపంచమే లేదన్నట్టుగా కెరీర్‌ను కొనసాగిస్తుంది. తన మనస్తత్వానికి తగ్గట్టే తనకు వచ్చే కలలన్నీ కూడా సినిమాలకు సంబంధించిన కలలే వస్తుంటాయని అంటోంది. ఎక్కడైనా ఎవరైనా మంచి నృత్యం చేస్తే వెంటనే తన మనసు సినిమాల మీదకు మళ్లిపోతుందట. అటువంటి సన్నివేశాలను తెరపై చూపించాలని ఒకటే తపించిపోతుందట మనసు. ఎక్కడైనా ఒక మంచి మాట చదివితే ఇలాంటివి సినిమాలో చెబితే జనాలకు మరింత చేరువ అవుతుంది కదా అనిపిస్తుందట. నటి అయ్యాక తాను మనుషుల్ని, ప్రకృతిని చూసే కోణమే మారిపోయిందని, ఆఖరిని తన కలలు కూడా సినిమాల చుట్టూనే తిరుగుతున్నాయని ఒకటే చెబుతోంది. తాను నటించిన సినిమా విడుదల అవుతోందంటే ఆ ముందు రోజు రాత్రి ఆ సినిమాకు సంబంధించిన కలలే వస్తాయట. సినిమాలపై, తన కెరీర్‌పై తనకు గల ప్రేమకు ఇది నిదర్శనమని అంటోంది.
అనుష్క సినిమా కలలు

Review అనుష్క సినిమా కలలు.