
రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో బరువైన పాత్రల్లో నటించిన అనుభవమో ఏమో.. బయట కూడా చాలా బరువైన డైలాగులు చెబుతోంది. ‘ఆడిపాడే హీరోయిన్ పాత్రలైతే పిక్నిక్కు వెళ్లొచ్చినట్టు ఉంటుంది. అదే కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలైతే.. కొంచెం సినిమా బరువును మోయక తప్పదు. అయినా.. తెరపై దర్శకుడు అనేక పాత్రలను ఆవిష్కరిస్తాడు. ఆ పాత్రల్లో నేనూ ఒకటి మాత్రమే. అన్ని సన్నివేశాల్లో నేనే కనిపించాలి.. సినిమా అంతా నేనే కనిపించాలి అనే కోరిక లేదు’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. ఈమె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న బాహుబలి విడుదలకు సిద్ధమైంది. అనేకానేక పాత్రల్లో ఈమె పాత్ర ఎలా
ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే
Review అనేక పాత్రల్లో ఒకటి.