రామ్‍గోపాల్‍వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న ‘ఆఫీసర్’ హంగామా చేస్తున్నాడు. ‘శివ’, ‘అంతం’, గోవిందా గోవిందా’ తరువాత వీరిద్దరి కాంబినేషన్‍లో వస్తున్న ఈ చిత్రంలో మైరా శరీన్ కథానాయికగా నటిస్తోంది. సుధీర్‍చంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‍ను ఆవిష్కరించారు. మే 25వ తేదీని ‘ఆఫీసర్’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్‍గోపాల్‍వర్మ – నాగార్జున కాంబినేషన్‍లో గతంలో వచ్చిన ‘శివ’ తెలుగు చిత్రసీమ రూపురేఖలనే మార్చేసిన విషయం తెలిసిందే. అటు తరువాత వస్తున్న ‘ఆఫీసర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయితే, ఖచ్చితంగా అందుకుంటామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులో నాగార్జున పాత్ర చిత్రణ, యాక్షన్ దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
‘ఆఫీసర్’ వచ్చేస్తున్నాడు!

Review ‘ఆఫీసర్’ వచ్చేస్తున్నాడు!.