సాధారణంగా అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ‘అలా రాసి పెట్టి ఉంది. … మనమేం చేస్తాం’ అనుకోవడం కద్దు. ఒక్కోసారి అనుకోని అవకాశాలు కూడా ఇలాగే వచ్చి తలుపు తడతాయి. టాలీవుడ్ సుందరాంగి రాశీఖన్నా విషయంలోనూ అదే జరిగింది. ఇటీవలే ‘మిస్టర్’ పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వరుణ్‍తేజ్… తాజాగా బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు మొదట హీరోయిన్‍గా మెహరీన్ పేరు నిర్ధారించారు. అయితే, దేవుడు రాశీఖన్నా పేరు రాసినట్టున్నాడు. మెహరీన్ స్థానంలో వెంటనే ఆమె సెలెక్ట్ అయ్యింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రంలో వరుణ్‍తేజ్ నటిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే రాశీతో వరుణ్ ఆడిపాడనున్నాడన్న మాట.
ఆలా ‘రాశి’ పెట్టి ఉంది

Review ఆలా ‘రాశి’ పెట్టి ఉంది.