మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే హైదరాబాద్‍లో చిరంజీవి, బాలీవుడ్ తార మౌనీరాయ్‍పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి, మౌనీరాయ్‍తో పాటు వంద మంది డ్యాన్సర్లతో ఈ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. దీంతో సినిమా పూర్తయినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటించారు. కుమాన్ కపూర్ ముఖ్య పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. టాకీ భాగం చిత్రీకరణ ఇదివరకే పూర్తయింది. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరకర్త. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు. ఇదిలా ఉండగా, చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‍లో రూపుదిద్దుకుంటున్న మరో చిత్రం సైతం ఇటీవలే కేరళలో ఒక షెడ్యూల్‍ను పూర్తి చేసుకుంది.










































































































































































































































Review ఇక విడుదలే తరువాయి!.