
ఏటా సంక్రాంతికి అగ్రహీరోల భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతుండటం, అతి పెద్ద పోటీ నెలకొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పవన్‌కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’; బాలకృష్ణ ‘జైసింహా’ విడుదల కానున్నాయి. అయితే దీనికి మించి ఏప్రిల్ 27వ తేదీ చిత్ర పరిశ్రమను ఇంకా ఆకర్షిస్తోంది. ఎందుకంటే, ఈ తేదీనే అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ విడుదల కానుంది. అదే తేదీన మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’ వస్తోంది. ఇక, రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ రిలీజ్ కూడా అదేరోజు. ఒకేరోజు మూడు భారీ బడ్జెట్ చిత్రాలు రానుండటంతో థియేటర్ల సమస్య నెలకొంది. ముగ్గురూ అగ్రహీరోలే కావడం, థియేటర్లు సర్దుబాటు కాకుంటే సమస్యలు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.
Review ఏప్రిల్ 27.. విడుదల.