
టాలీవుడ్లో ఎడాపెడానటించేసిన రకుల్‌ప్రీత్‌సింగ్ ఇటీవల తెలుగు తెరపై కనిపించడం లేదు. ఆ మాటే ఆమెను అడిగితే ఇదిగో ఇలా స్పందించింది- ‘చిత్రసీమలో మనకు నచ్చినట్టు ఉండటం కుదరదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి. మన వ్యక్తిగత అభిప్రాయాలూ, విలువలూ ఎప్పుడూ మనతోనే ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితులకు తగినట్టుగా ఆలోచించాలి. కొన్ని విషయాలను చూసీ చూడనట్టు, వినీ విననట్టు వదిలేయాలి. ఇంకొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలనుకుంటే కుదరదు. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడే సంయమనం పాటించాలి. ఒక్కోసారి మనల్ని మనం పూర్తిగా ఆవిష్కరించుకోవాలి. ఏదెప్పుడు చేయాలనేది అనుభవమే నేర్పుతుంది’ అంటూ చాలా చెప్పు కొచ్చింది. ఇంతకీ ఇదంతా ఎందుకో?
Review కొన్నిటిని వదిలేయాలంతే….