
త్రివిక్రమ్ అంటేనే అక్షరాలతో ఆడుకుంటారు. ఆయన సంభాషణలు ఎంత బలంగా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. ఇక, అటువంటి దర్శకుడికి పదాలతో ఆడుకుంటూ పాట కట్టే సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గీత రచయిత తోడైతే.. ఇక చెప్పేదేముంది? ఇప్పుడు అదే జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ‘గాలి వాలుగ ఓ గులాబి వాలి గాయమైనది..’ అనే పాట విడుదలైంది. ఈ పాట విన్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్‌కల్యాణ్, కీర్తిసురేశ్‌పై చిత్రీకరించిన ఈ గీతానికి అనిరుధ్ స్వర సారథ్యం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘బయటికొచ్చి చూస్తే..’ గీతం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. జనవరి 10న ‘అజ్ఞాత వాసి’ సినిమా విడుదల కానుంది. ఇందులో పవన్ స్టిల్స్ కానీ, లుక్స్ కానీ డిఫరెంట్‌గా ఉండటంతో పాటు.. అవన్నీ అంచనాలను పీక్స్‌కు తీసుకు వెళ్తున్నాయి.
Review గాలి వాలుగ.. ఓ గులాబి వాలి….