గెలిచే వాడిదే జీవితం

‘ఆట గదరా శివ’ అంటూ తొలి సినిమాతోనే వెండితెరపై ఓ ఆటాడుకున్న వర్ధమాన నటుడు ఉదయ్‍శంకర్‍.. తాజాగా ‘మిస్‍ మ్యాచ్‍’ సినిమాతో తాను నటనలో మేటినని నిరూపించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘మిస్‍ మ్యాచ్‍’ ట్రైలర్‍.. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఎందరో ప్రేక్షకులను అలరించింది. ‘గెలిచే దాకా పరుగెత్తు.. గెలిచే వాడిదే జీవితం’ అంటూ ఉన్న ఇందులోని డైలాగులు, ఫైట్‍ సీన్స్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు తగ్గట్టుగానే వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రధానంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఈ సినిమాకు తెలుగు వారి నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘మిస్‍ మ్యాచ్‍’ విడుదలైన తొలి రోజు నుంచే మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి ఆటతోనే పాజిటివ్‍ టాక్‍ రాబట్టుకున్న ఈ చిత్రం.. జీవితం విలువను చాటి చెప్పిందని తెలుగు యువత అంటోంది.

ఇదీ చిత్ర బృందం..

ఉదయ్‍ శంకర్‍ (‘ఆటగదరా శివా’ ఫేమ్‍) హీరోగా నటించిన ఈ చిత్రంలో తమిళ నటి ఐశ్వర్య రాజేశ్‍ కథానాయికగా చేసింది. ‘కాకా ముత్తై’, ‘కన్నా’ చిత్రాలతో తమిళనాట మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయి తాజా ‘మిస్‍ మ్యాచ్‍’ తెలుగు చిత్రంలో ఉదయ్‍ శంకర్‍తో పోటీపని నటించింది. ఈమె దివంగత నటుడు రాజేశ్‍ కుమార్తె కావడం విశేషం. ఇక, తమిళంలో విజయ్‍ ఆంటోనీ నటించగా, తెలుగులో ‘సలీం’ పేరుతో డబ్‍ అయిన సినిమాకు దర్శకత్వం వహించిన ఎన్‍వీ నిర్మల్‍కుమార్‍ ఈ చిత్ర దర్శకుడు. ఈయనకు ఇదే తొలి తెలుగు చిత్ర మైనా.. ఎక్కడా ఆ లోటుపాట్లు కనబడనివ్వకుండా అందమైన సెల్యులాడ్‍ను తెరకెక్కించారని అందరూ ప్రశంసిస్తున్నారు. అధిరో క్రియేటివ్‍ సైన్స్ ఎల్‍.ఎల్‍.పీ. అనే కొత్త చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘మిస్‍ మ్యాచ్‍’ చిత్రాన్ని నిర్మించింది.

జి.శ్రీరామ్‍రాజు, భరత్‍రామ్‍ నిర్మాతలు.

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలను అందించిన వెటరన్‍ భూపతిరాజా ఈ చిత్రానికి కథను సమకూర్చారు. సంజయ్‍ స్వరూప్‍, ప్రదీప్‍ రావత్‍, రూపాలక్ష్మి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక, గిఫ్టస్‍ ఇలియాస్‍ అందించిన స్వరాలు చిత్రానికి ప్రాణం పోశాయి. ముఖ్యంగా బ్యాక్‍గ్రౌండ్‍ స్కోర్‍ సినిమాపై ఉత్కంఠను కలిగించడంలో సఫలమైంది. ఇలియాస్‍కు ఇది తెలుగు చిత్రం. తనదైన ముద్ర వేయడానికి ఆయన శ్రమించినట్టు పాటలు, సంగీతం వింటే తెలుస్తుంది. గణేశ్‍ చంద్ర కెమెరా పనితనం సినిమాను కొత్తగా చూపించింది. ఇంకా సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‍ తేజ సాహిత్యం విలువలకు పట్టం కడితే. రాజేంద్రకుమార్‍, మధు మాటలు తూటాల్లా పేలాయి. ఆర్ట్ డైరెక్టర్‍ మణివాసగం ఆయా సెట్స్ను నేటివిటీకి దగ్గరగా రూపొందించడం ఆకట్టుకుంది. ‘మిస్‍ మ్యాచ్‍’ టైటిల్‍తో జనవరిలో క్లాప్‍ కొట్టుకున్న ఈ చిత్రం.. టైటిల్‍తోనే సగం హైప్స్ క్రియేట్‍ చేసింది.

గెలిచే వరకు పరుగెత్తు..

‘మిస్‍ మ్యాచ్‍’ సినిమా కథ విషయానికి వస్తే.. క్రీడల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. హీరో, హీరోయిన్‍ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు కథను పరుగులెత్తిస్తాయి. హీరో పలికే డైలాగులకు థియేటర్లలో చప్పట్లు పడుతున్నాయి. తొలి సినిమా ‘ఆట గదరా శివ’తో నిరూపించు కున్న హీరో ఉదయ్‍ శంకర్‍ కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడని ‘మిస్‍ మ్యాచ్‍’ చూస్తే తెలుస్తుంది. తొందరపడి వచ్చిన అవకాశా లను క్యాష్‍ చేసేసుకోకుండా.. కథను బట్టే సిని మాలను చేయాలనే అతని జడ్జిమెంట్‍ కరెక్టేనని ఈ సినిమా ద్వారా నిరూపితమైంది. తెలుగులో తొలి చిత్రమైనా కానీ.. దర్శకుడు నిర్మల్‍కుమార్‍.. తన మేకింగ్‍ స్టైల్‍తో సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. కథానాయిక ఐశ్వర్య రాజేశ్‍.. హీరో ఉదయ్‍ శంకర్‍తో పోటీ పడి నటించింది. ‘కాకా ముత్తై’ తమిళ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా చేసిన నటనకు అంతర్జాతీయంగానూ ప్రశంసలు పొందిన ఐశ్వర్య.. ఈ సినిమాలో అల్లరి పిల్లగా అలరించింది. అమాయకంగా, ధైర్యంగా ఉండే లేడీ రెజ్లర్‍గా ఐశ్వర్య నటన కట్టి పడేస్తుంది. ఈ సినిమా కోసం ఆమె కొన్నాళ్లు రెజ్లింగ్‍లో శిక్షణ పొందారు. ఆ శ్రమ తెరపై కనిపిస్తుంది. గణేశ్‍ సినిమాటోగ్రఫీ సినిమాను మరో హైట్స్కు తీసుకెళ్లింది. ఆయా సన్నివేశాలను తన విజువలైజేషన్‍తో ఆయన రక్తి కట్టించిన తీరు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తోంది.

పవన్‍ సాంగ్‍కు అదిరే రెస్పాన్స్

‘తొలిప్రేమ’లోని పవన్‍ కల్యాన్‍ సాంగ్‍ ‘ఈ మనసే..’ ఎంత ఫేమస్సో, ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్‍ను ‘మిస్‍ మ్యాచ్‍’ కోసం రీమేక్‍ చేశారు. ఈ పాట కోసమే మూడు రోజులు ప్లాన్‍ చేసి నాలుగు నిమిషాల సాంగ్‍ను షూట్‍ చేశారు. ఈ పాట థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో విశేషం ఏమిటంటే.. సాంగ్‍ ఫుల్‍ స్పీడ్‍గా సాగుతుంది.. నటుల పెర్ఫార్మెన్స్ మాత్రం స్లో మోషన్‍లో ఉంటుంది. ఇది కొత్త ప్రయోగంగానే ప్రేక్షకులు ఫీలవు తున్నారు. పవన్‍ ఫ్యాన్స్ సైతం థియేటర్లలో ఈ సాంగ్‍కు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. విజయ్‍ మాస్టర్‍ ఈ పాటను చాలా గ్రాండియర్‍గా తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం.

ఎవరెవరు ఎలా నటించారంటే..

ఉదయ్‍ శంకర్‍ నటనలో మంచి ఈజ్‍ ఉన్న నటుడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఉదయ్‍ శంకర్‍ – ఐశ్వర్య రాజేశ్‍ మధ్య వచ్చే చాలా సన్నివేశాలు ఉద్విగ్నతకు గురి చేస్తాయి. ఐశ్వర్య నటన గురించి చెప్పాల్సిన పనే లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమె తన సహజ నటనతో ఆవలీలగా తన పాత్రను పండించింది. స్పోర్టస్ బ్యాక్‍డ్రాప్‍ రోల్‍లో ఎక్స్ట్రార్డి నరీగా నటించిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య నడిచే, రెండు కుటుంబాల మధ్య నడిచే ఎమోషనల్‍ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయని చిత్ర విడుదలానంతరం ప్రేక్షకుల స్పందనను బట్టి తెలుస్తోంది. ఒక మంచి చిత్రం చూశామన్న అనుభూతి కలిగించిందని అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు అమెరికాలోని తెలుగు వారు అంటున్నారు. అందుకు తగినట్టే ఈ సినిమా వసూళ్లలో బాక్సాఫీసులను బద్దలుకొడుతోంది.
డైలాగ్‍ కొట్టు గురూ..
‘బలమే జీవితం..
బలహీనతే చావు..’
‘నీ కళ్లలో లక్ష్యం.. గుండెల్లో ఆత్మ విశ్వాసం.. గెలిచే దాకా పరుగెత్తు..’
‘గెలిచే వాడిదే జీవితం’..
సినిమాలో కథానుసారంగా వచ్చే ఈ డైలాగ్స్ ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇంకా కుటుంబ సన్నివేశాలను దర్శకుడు చాలా ఎమోషనల్‍గా తెరకెక్కించారని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. అన్ని భాషల్లోనూ క్రీడల బ్యాక్‍డ్రాప్‍లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు విజయవంతమయ్యాయి. తాజాగా ‘మిస్‍ మ్యాచ్‍’ కూడా ఆ జాబితాలో చేరింది. ఫస్ట్ లుక్‍ పోస్టర్‍, ట్రైలర్‍, టీజర్లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి హైప్స్ క్రియేట్‍ చేసిన ‘మిస్‍ మ్యాచ్‍’ విడుదల తరువాత కూడా తెరపై ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరచదు. పైగా సినిమా విడుదలకు ముందు నెలకొన్న అంచనాలను మరింత హైట్స్కు తీసుకెళ్తుంది. ఉదయ్‍ శంకర్‍ ఈ సినిమా సక్సెస్‍తో తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నట్టేనని, అతను మరిన్ని మంచి చిత్రాలతో ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటూ సంబరపడుతున్నారు.

Review గెలిచే వాడిదే జీవితం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top