ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో పంతం పడతారు. ఏదైనా సొంతం చేసుకోవాలని కొందరు.. ఎవరినైనా అంతం చేయాలని మరికొందరు.. దుర్మార్గుల పని పట్టాలని ఇంకొందరు.. ఇలా ప్రతి ఒక్కరి పంతానికి ఏదో ఒక కారణం ఉంటుంది. గోపీచంద్ కూడా అలాగే ఓ మంచి పని కోసం పంతం పట్టాడు. అది దేని కోసమే తెర మీద చూడాల్సిందే అంటోంది చిత్ర బృందం. గోపీచంద్ హీరోగా సత్యసాయి ఆర్టస్ బ్యానర్‍పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రానికి ‘పంతం’ అనే టైటిల్‍ను కన్ఫార్మ్ చేశారు. ‘ఫర్ ఏ కాజ్’ అనేది ఉప శీర్షిక. ఇది గోపీచంద్‍కు 25వ సినిమా. చక్రి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. మే 18న సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మంచి మెస్సేజ్‍తో తెరకెక్కుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టు కుంటుందని అంటున్నారు.
గోపీచంద్ ‘పంతం’

Review గోపీచంద్ ‘పంతం’.