చూద్దామా.. వెంకీ మామ హంగామా

నిజ జీవితంలోని మామా అల్లుడు.. తెరపై కూడా అదే బంధాన్ని పంచుకుంటే. ఆ మజానే వేరు కదా! ఇప్పుడు విక్టరీ వెంకటేశ్‍, నాగచైతన్య అదే చేయబోతున్నారు. వీరిద్దరు మామ – అల్లుడుగా కలిసి నటిస్తున్న సినిమా ‘వెంకీ మామ’. రాశీఖన్నా, పాయల్‍ రాజ్‍పుత్‍ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మామ – అల్లుడి బంధం ప్రత్యేకమైనది. వీరిద్దరూ ఒకరి బలం మరొకరు అవుతారు. నిజ జీవితంలో కూడా మామ – అల్లుడైన వెంకీ, చైతూ ఈ చిత్రంలో ఎలా చించేస్తారో చూడాల్సిందే. గతంలో ‘ప్రేమమ్‍’ అనే సినిమాలో వీరిద్దరూ కాసేపు హంగామా చేశారు. ఆ మాత్రం సీన్‍కే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక పూర్తి నిడివి చిత్రంలో నిజ జీవిత బంధాలతో కూడిన పాత్రలు పోషిస్తుండటంతో ‘వెంకీ మామ’ క్రేజ్‍ సృష్టిస్తోంది. ఈ సినిమాకు బాబీ దర్శకుడు. ఇంకో పాట చిత్రీకర ణతో షూటింగ్‍ కంప్లీట్‍ అవు తుంది బహుశా దసరాకు ఈ చిత్రం విడుదల కావచ్చు

Review చూద్దామా.. వెంకీ మామ హంగామా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top