తెలుగు సినీ పరిశ్రమలో అనుష్కది డిఫరెంట్ కెరీర్. ఒకపక్క వాణిజ్య అంశాలతో రూపొందే చిత్రాల్లో, మరోపక్క కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఆమె తన కెరీర్‍ను కొనసాగిస్తోంది. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ వంటి చిత్రాలు, ఆమె చిత్రాల ఎంపికలో చూపుతున్న వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా ఆమె కథానాయికగా వస్తున్న ‘భాగమతి’ కూడా అనుష్కను మరో మెట్టుపైన నిలుపుతుందని ఆ చిత్ర బృందం చెబుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ప్రచార చిత్రం అందరిలోనూ ఉత్కంఠ కలిగించింది. అనుష్కకు ఒక చేతిలో ఆయుధం ఉండగా, మరో చేతికి శిలువ వేసి ఉంది. విర బోసిన జుత్తుతో అనుష్క రూపం చూస్తుంటే కచ్చితంగా మరో థ్రిల్లర్‍తో ఆమె మురిపించనుందని అనిపిస్తోంది. తెలుగు, తమిళ, మల యాళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. థ్రిల్, సస్పెన్స్ కలబోసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర దర్శకుడు అశోక్ చెబుతున్నాడు. చూడాలి.. ‘బాహుబలి’ తరువాత అనుష్క ఏ రేంజ్‍లో అభిమానులను అలరిస్తుందో!
థ్రిల్ చేయనున్న ‘భాగమతి’

Review థ్రిల్ చేయనున్న ‘భాగమతి’.