
బాలకష్ణ-పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి బాలకష్ణ, పూరీ లాంటి డాషింగ్ డైరెక్టర్ తో కలిసి పని చేస్తుండడంతో వీరి సినిమాకు సంబంధించి ప్రతీ విషయం అందరిలో ఆసక్తిని పెంచుతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యూనిట్ షూటింగ్ బిజీగా ఉన్నట్లు సమాచారం. అసలే పూరి అతి తక్కువ కాలంలో సినిమాను పూర్తి చేస్తారన్నది అందరికీ తెలిసింది. ఇదిలాఉంటే ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్ ఏంటీ, హీరోయిన్ ఎవరు అనే విషయాలపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు ఈ మూవీ యూనిట్. అదే సమయంలో బాలయ్యతో ముగ్గురు భామలు ఇందులో నటించనున్నారని సమాచారం చెక్కర్లు కొడుతోంది. మరోవైపు తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విజయంతో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య.. ఈ మూవీపైనా ఫుల్ కాన్సంట్రేషన్ చేశారని టాలీవుడ్ టాక్.. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ ఊహించనిదే అయినా.. 101 వ సినిమా
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం పూరి దర్శకత్వంలో సినిమా రావడం పండగ అనే చెప్పాలి.
Review పూరి.. బాలకృష్ణ కొత్తబాట.