పెళ్లి డేట్‍ ఫిక్స్

టాలీవుడ్‍ యంగ్‍ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‍ సమంతల పెళ్లి డేట్‍ ఫిక్స్ అయ్యింది. వీరి వివాహం ఈ ఏడాది అక్టోబర్‍ 6న జరగనుంది. అప్పుడే హనీమూన్‍ ప్లేస్‍ కూడా ఈ కాబోయే దంపతులు డిసైడ్‍ చేసేసుకున్నారు. న్యూయార్క్లో ఈ జంట వివాహానంతరం గడపనుంది. వీరిద్దరి తొలి సినిమా ‘ఏం మాయ చేశావె’ ఎక్కువ భాగం న్యూయార్క్లోనే చిత్రీకరించారు. ఇక్కడ చిత్రీకరించిన పలు సన్నివేశాల్లో మంచి రొమాంటిక్‍ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అందుకే కాబోలు ఈ జంట హనీమూన్‍స్పాట్‍గా న్యూయార్క్ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను స్వయంగా నాగచైతన్య వెల్లడించాడు. అలాగే, పెళ్లి కాబోయేలోపు… సమంతతో ఓ మంచి రొమాంటిక్‍ మూవీ చేయాలని ఉందని కూడా చెప్పాడు. కాబోయే భార్య అడిగితే కాదంటుందా? అని టాలీవుడ్‍ జనాలు అనుకొంటున్నారు.

Review పెళ్లి డేట్‍ ఫిక్స్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top