
భన్వర్‌సింగ్ షెకావత్.. ‘పుష్ప’లోని ఈ క్యారెక్టర్ పేరు గుర్తుంది కదా! ఈసారి ఎలాగైనా పుష్పపై ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నాడు భన్వర్‌సింగ్.. అదే ఈ పాత్రధారి ఫహద్ ఫాజిల్. మరి ఈ ఇద్దరి మధ్య జరిగే పోరులో గెలిచేదెవరో తెలియాలంటే ‘పుష్ప2’ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇటీవలే ఫహాద్ పుట్టినరోజు కావడంతో, ఆయన చిత్రంతో కూడిన, ‘ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగానే ‘పుష్ప2’ తెరకెక్కుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సుకుమార్ దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో కీలకమైన పోలీస్ అధికారి పాత్రలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు.
Review ప్రతీకారమే లక్ష్యం...