‘బాహుబలి’ తరువాత మళ్లీ బాహుబలి రెండో భాగం షూటింగ్‍లో నిమగ్నమైన ప్రభాస్ తన సొంత బ్యానర్‍పై సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బాహుబలి ద్వారా తమిళం, హిందీ భాషల్లోనూ ప్రభాస్ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ రెండు మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని త్రిభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘రన్ రాజా రన్’ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ తదుపరి చిత్రం రూపొందనున్నది. సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ పతాకంపై దీన్ని తెరకెక్కిస్తారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనున్నది. ఈ చిత్రానికి ఏకంగా వంద కోట్ల బడ్జేట్ కేటాయించారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్‍ను విలన్‍గా తీసుకోనున్నారు. 2017 జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. కాగా, తమిళంలో హరి దర్శకత్వంలో ‘సింగమ్’ సిరీస్‍లో మూడో పార్ట్గా రాబోతున్న ‘ఎస్-3’లో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తమిళ మార్కెట్‍లోకి కూడా ప్రవేశించే ఆలోచనలు ఉండబట్టే తమిళ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారని సమాచారం. అయితే నిజంగా ప్రభాస్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారా లేదా అనేది తెలియాలంటే ఈ ఏడాది డిసెంబరు వరకు ఆగాల్సిందే. ఎస్-3 రిలీజ్ అయ్యేది అప్పుడే మరి!. మరోపక్క బాహుబలి రెండో భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాహుబలి మొదటి భాగాన్ని మించి సంచలనం చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ తదేకంగా ఈ సినిమా కోసం శ్రమిస్తోంది.
ప్రభాస్ వంద కోట్ల సినిమా

Review ప్రభాస్ వంద కోట్ల సినిమా.