ఫ్యాన్స్ కి పండగే పండగ

‘బ్రహ్మోత్సవం’ తరువాత చాలా గ్యాప్‍ తీసుకున్న మహేశ్‍బాబు… మురుగుదాస్‍తో కలిసి కొత్త సినిమా చేస్తున్నాడు. డిటెక్టివ్‍ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ‘స్పైడర్‍’ అనే టైటిల్‍ను ఖరారు చేయనున్నట్టు ‘తెలుగు పత్రిక’ ముందే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను మహేశ్‍బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9న విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి జూన్‍ 23వ విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. పుట్టిన రోజు కూడా కలిసి వస్తుండటంతో ఆగష్టు 9 విడుదల తేదీగా నిర్ణయించారని ఫిల్మ్నగర్‍ టాక్‍. ఇంకా మే నెలాఖరు వరకు ‘స్పైడర్‍’ ఘూటింగ్‍ జరగనుంది. రకుల్‍ప్రీత్‍ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాను ‘ఠాగూర్‍’ మధు, ఎన్వీప్రసాద్‍ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మహేశ్‍ ఫస్ట్లుక్‍ అభిమానుల్ని సంబరాల్లో ముంచింది.

Review ఫ్యాన్స్ కి పండగే పండగ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top