మిగతా హీరోయిన్లతో పోలిస్తే అనుష్క కొంచెం డిఫరెంట్. ‘ఒకసారి ఒక సినిమా’తోనే ముందు నుంచీ ఆమె కెరీర్ కొనసాగిస్తోంది. ఇదే విషయం ఆమెను అడిగితే- ‘అవును. ఒకేసారి రెండుమూడు పనులు చేయడం నాకు రాదు. ఇది నా బలహీనతే కావచ్చు. కానీ ఒకసారి ఒకేపనిని మంచి ఏకాగ్రతతో చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు కూడా. అందుకు నేను నటించిన సినిమాల సక్సెసే నిదర్శనం’ అంటూ చెప్పుకొస్తోంది. కొందరు ఒకేసారి 3-4 సినిమాల్లో నటిస్తుంటారని, వారిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందని, అయినా, నా శైలిలోనే నేను ముందుకు వెళ్తానని ఈ అమ్మడు చెబుతోంది. అన్నట్టు, ‘భాగమతి’ హిట్‍ను ప్రస్తుతం ఈమె ఎంజాయ్ చేస్తోంది. తెరపై కనిపించే తన పాత్రలు తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని సంబర పడుతూ చెప్పింది.
బలహీనతలోనే బలం ఉంది

Review బలహీనతలోనే బలం ఉంది.