
దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చి.. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో సంచలన రికార్డులు సృష్టించిన రజనీకాంత్ ‘బాషా’ డిజిటల్ హంగులు అద్దుకుని మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రిలీజైన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పట్లో ‘బాషా’ను నిర్మించిన సత్య మూవీస్.. ఇటీవల 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రాన్ని మళ్లీ ఇలా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇందు కోసం విజువల్ ఎఫెక్టస్తో పాటు నేపథ్య సంగీతాన్ని మళ్లీ రికార్డు చేశారు. థియేటర్లలో సరికొత్త ‘బాషా’ను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
Review బాష చూడు మళ్ళి వచ్చాడు.