బాహుబలి సినిమా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడిగా ఈ సినిమాకు సంబంధించి రాజమౌళికే ఎక్కువ మార్కులు పడ్డాయి. మరి ఈ సినిమాలో అత్యంత ఆదరణ పొందిన డైలాగ్స్ సంగతేమిటి? వీటిని ఎవరు రాశారు? రైటర్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఇటీవల అందరికీ పెరిగింది. దీనిపై చర్చ జరగడమే ఇందుకు కారణం. ఈ సందర్భంగా ‘బాహుబలి’ సినిమా డైలాగ్ రైటర్‍గా వెలుగులోకి వచ్చిన పేరు- ‘డైమండ్’ రత్నబాబు. ‘భాయ్’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సీమశాస్త్రి’, ‘ఈడో రకం.. ఆడో రకం’ సినిమాలకు మాటలు రాసింది ఈయనే. దర్శకుడితో పోలిస్తే రచయితలకు తగిన గుర్తింపు, రావాల్సినంత పేరు రావడం లేదనేది ఈయన వాదన. త్వరలోనే తానూ దర్శకత్వం వహించనున్నట్టు చెప్పారు రత్నబాబు. ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది.
‘బాహుబలి’ డైలాగ్ రైటర్ ఈయనే

Review ‘బాహుబలి’ డైలాగ్ రైటర్ ఈయనే.