
సుకుమార్.. ‘ఆర్య’, ‘నాన్నకు ప్రేమతో..’ వంటి చిత్రాలతో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్ తాజాగా మెగా హీరో రామ్‌చరణ్‌తో సినిమా రూపొందించనున్నారు. మిగతా దర్శకులతో పోలిస్తే సుకుమార్‌ది భిన్నమైన శైలి. స్టోరీ, స్క్రీన్ప్లేల విషయంలో ఆయన వైవిధ్యం చూపిస్తారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో తన మార్కు స్టయిల్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రూపుదిద్దనున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా ‘ధ్రువ’ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నవంబర్‌లో సుకుమార్‌తో సినిమా ప్రారంభమవుతుంది.
Review భలే కాంబినేష•.