భీం..భీం భీమ్లానాయక్‌

పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భీమ్లానాయక్‌ ఫస్ట్‌ లుక్‌తో పాటు పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. భీం.. భీం.. భీమ్లానాయక్‌ అంటూ సాగే ఈ పాట ఫాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్‌ స్వరాలు అందించాడు. ఈ గీతం ప్రారంభంలో ‘కిన్నెర’ కళాకారుడు మొగులయ్య పాడిన పద్యం ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. మలయాళీ హిట్‌ ఫిల్మ్‌ ‘అయ్యుప్పున్‌ కోషియమ్‌’ ఇది రీమేక్‌. విడుదలైన వారంలోనే రెండుకోట్ల వ్యూస్‌ రాబట్టుకున్న టైటిల్‌ సాంగ్‌.. ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలను పెంచేస్తుంది. ఈ ఏడాది విడుదలవుతున్న సినిమాల్లో భీమ్లానాయక్‌ అతిపెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌తో రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోవడానికి అనేకానేక కారణాల్లో ఒకటి` ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సంభాషణలు కూర్చడం. ఇక, పవన్‌ చేతిలో ఇంకా ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ వంటి చిత్రాలున్నాయి. స్టైలిష్‌ దర్శకుడు సురేందర్‌రెడ్డి మరో కథతో రెడీగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా ఫ్యాన్స్‌ పండుగ చేసుకునేలా ఉంది.

Review భీం..భీం భీమ్లానాయక్‌.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top