
స్టార్ సింగర్ కేజే ఏసుదాస్ ఇటీవల జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. మొన్నటి వరకు అభిమాన నటులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వెంటపడి ఆటోగ్రాఫ్‌లు తీసుకునే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా! చేతిలో ఉన్న ఫోన్‌తో ‘సెల్ఫీ ప్లీజ్’ అంటున్నారు. ఇంతకీ విషయానికి వస్తే.. అవార్డు ఫంక్షన్‌కు వచ్చిన ఏసుదాసును అభి మానులు, మీడియా ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఒక అభిమాని రెండడుగులు ముందుకు వేసి ఆయన ముందు నిలుచుని సెల్ఫీ తీసుకున్నాడు. వెంటనే ఏసుదాస్ ఆ అభిమానిని పిలిచి, ఆ ఫొటోను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించారు. అభిమాని సంశయించే సరికి ఫోన్ లాక్కుని ఆ సెల్ఫీ ఫొటోను తానే స్వయంగా డిలీట్ చేశారు. ‘ఇది సెల్ఫీ కాదు సెల్ఫిస్’ అంటూ హితవు చెప్పారు. ఆయనకు సెల్ఫీలంటే ఎంత అసహ్యమో ఈ ఘటన ద్వారా రుజువైంది. ఏసుదాస్ మంచి పనే చేశారని అక్కడున్న వారంతా వ్యాఖ్యానించారు.
Review ‘భేష్’దాస్!.