
అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రాజ్‌తరుణ్ హీరోగా నిర్మించిన చిత్రం ‘రంగుల రాట్నం’. శ్రీరంజని దర్శకురాలు. సరదా ప్రేమ కథా చిత్రంగా ఇది రూపుదిద్దుకుంది. రాజ్ తరుణ్ పాత్ర ఇందులో మన పక్కింటి అబ్బాయి క్యారెక్టర్లా ఉంటుందట. అలాగని అల్లరి చిల్లరగా తిరిగే పాత్ర కాదు సుమా!. జీవితంలో స్థిరపడిన బాగా బుద్ధిమంతుడైన అబ్బాయిగా రాజ్‌తరుణ్ ఇందులో కనిపించబోతున్నాడు. ఓ అమ్మాయి అకస్మాత్తుగా అతని జీవితంలో ఎదురవుతుంది. ఈ సందర్భంగా కలిగిన అనుభవాలు ఏమిటనేదే ఈ చిత్ర కథాంశం. పెద్దలు, యువతీ యువకులు అందరూ కలిసి చూడదగిన సినిమా ఇదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మరో మహిళా దర్శకురాలు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతోంది. శ్రీరంజని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజ్‌తరుణ్ ఈ సినిమా తరువాత ఈ ఏడాది మూడు సినిమాలు చేయబోతున్నట్టు చెబుతున్నాడు.
Review ‘రంగుల రాట్నం’ రెడీ….