
కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘జూరాసిక్ పార్క్’ గుర్తుంది కదా? అదే సిరీస్లో మరో మూడు చిత్రాలు కూడా వచ్చాయి. ఇవన్నీ దేశం, భాష తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి. మన తెలుగులో అయితే, జూరాసిక్ పార్క్’ను ఎగబడి చూశారు. అందులోని గ్రాఫిక్స్ గురించి, రాకాసి బల్లుల గురించి రోజుల తరబడి చర్చించుకున్నారు. తాజాగా ఈ మూడు సినిమాలకు కొనసాగింపుగా నాలుగో చిత్రమూ రాబోతోంది. ‘జూరాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్’ పేరుతో వస్తున్న తాజా చిత్రం జూన్ 22న విడుదల కాబోతోంది. అదేరోజు తెలుగులోనూ అనువాద సినిమా విడు దల కానుంది. ఇస్లా న్యూబ్లర్లోని ‘జూరాసిక్ వరల్డ్’ థీమ్ పార్క్ ధ్వంసమయ్యాక అక్కడ ఉండే డైనోసార్లకు ముప్పు వాటిల్లుతుంది. వాటిని రక్షించడానికి థీమ్ పార్కుకు ఒకప్పుడు మేనే జర్గా పనిచేసిన క్లారీ డీరింగ్ సిద్ధమవుతాడు. ఆ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితుల నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Review రాకాసి బల్లులు మళ్లీ వస్తున్నాయ్...