
తాప్సీ గుర్తుంది కదా! తెలుగులో అడపాదడపా మాత్రమే నటించినా మంచి పేరు, గుర్తింపూ తెచ్చుకుంది. టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్‍లోనూ తడాఖా చూపిస్తున్న ఈ సుందరి తాజాగా బిగ్ బీ అమితాబ్ సరసన రెండోసారి నటించనుంది. ఆయన సినిమాలో చిన్న పాత్ర వస్తేనే ఆనందం అనుకునే నటులు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది ఏకంగా రెండోసారి ఆయన సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన తాప్సీ చాలా అదృష్టవంతురాలని అందరూ అంటున్నారు. గతంలో ఈమె ఆయనతో కలిసి ‘పింక్’లో నటించింది. అందులో తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా అమితాబ్ ప్రధాన పాత్రలో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ తాప్సీ మంచి పాత్రే దక్కించుకుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Review రెండోసారి బిగ్ బితో జోడి.