
మహేశ్‌బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఆల్రెడీ క్లైమాక్స్ చిత్రీకరణ ముందే పూర్తయ్యింది. ఇక మిగిలిన అన్ని బ్యాలెన్స్ పనులనూ పూర్తి చేసుకుని శర వేగంగా ముస్తాబవుతోందీ సినిమా. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఓ పబ్లిక్ మీటింగ్ నేపథ్యంలో జరిగే ఫైట్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇతర కీలక పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో మహేశ్‌బాబు భరత్ అనే పేరుతో సీఎంగా నటిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Review రెడీ ఫర్ రిలీజ్.